Fake News, Telugu
 

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా వృధాప్య పెన్షన్ లో కేంద్ర ప్రభుత్వం వాటా 800 రూపాయలు కాదు

0

తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్లలో ఎక్కువ సాయం కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుందని ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): అవ్వకి ఇచ్చే ఆసరా పెన్షన్లలో 800 రూపాయలు మోడీ ఇస్తుంటే అదే అవ్వకి కేసిఆర్ మాత్రం కేవలం 200  రూపాయలు ఇస్తున్నాడు.

.ఫాక్ట్ (నిజం): ఆసరా పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వ సహాయం 60-79 ఏళ్ళ వయసు వాళ్ళకి 200 రూపాయలు మరియు 80 ఏళ్ళు పై బడిన వాళ్ళకి 500 రూపాయలు మాత్రమే. మిగితాది రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. కావున పోస్ట్ చేసిన దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు.

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పెన్షన్లు ఇస్తుంది. ఆసరా పెన్షన్ల వెబ్ సైట్ కి వెళ్తే అక్కడ ఉన్న జీ.వో ప్రకారం వృద్ధులకు వెయ్యి రూపాయలు ఆసరా పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని తెలుస్తుంది.

ఆసరా పెన్షన్లకి కేంద్ర ప్రభుత్వం నుండి ఇందిరా గాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందుతుంది . నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం వెబ్ సైట్ లో ఉన్న స్కీం గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుండి 60-79 ఏళ్ళ వయసు వాళ్ళకి 200 రూపాయలు మరియు 80 ఏళ్ళు పై బడిన వాళ్ళకి 500 రూపాయలు మాత్రమే సహాయం అందుతుంది. కావున, పోస్ట్ లో చెప్పినట్టుగా మోడీ ప్రభుత్వం ఒక్కొక్కరికి 800 రూపాయలు ఇవ్వట్లేదు. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 500-800 రూపాయల వరకు ఖర్చు చేస్తుంది.

చివరగా, పోస్ట్ లో చెప్పింది అబద్ధం. కేంద్ర ప్రభుత్వం 800 రూపాయలు ఒక్కొక్కరికి ఆసరా పెన్షన్ కోసం ఇవ్వట్లేదు.

Share.

About Author

Comments are closed.

scroll