Fake News, Telugu
 

‘తనకు డబ్బులు దర్మం చేయకపోతే కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తా’ అనే ఫోటో ఫోటోషాప్ చేయబడినది

0

ఒక బిచ్చగాడు తనకు బిక్ష వేయకుంటే కాంగ్రెస్ కి ఓటు వేస్తా అని బెదిరిస్తున్న ఒక ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): బిచ్చగాడు: ‘నాకు కొంత డబ్బులు వేయండి లేకుంటే కాంగ్రెస్ కి మళ్ళీ ఓటు వేస్తా. అప్పుడు అందరం కలిసి అడుక్కోవచ్చు.’

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటోని ఎడిట్ చేసారు. అసలు ఫోటో లో ప్లకార్డ్ లేదు. ఫోటోషాప్ చేసి ప్లకార్డ్ ని పెట్టారు. కావున బిచ్చగాడు పైన చెప్పిన విధంగా అడుక్కోవట్లేదు.

పోస్ట్ చేసిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే అసలు ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఫోటో లో పోస్ట్ లో చూపెట్టినట్టుగా ఎటువంటి ప్లకార్డ్ లేదు. ఆ ఫోటో 2012 లో రంజాన్ మాసం సమయంలో హైదరాబాద్ లో తీసినట్టుగా ఫోటో వివరణ లో చూడొచ్చు.  ఫోటోషాప్ చేసి ప్లకార్డ్ ని పెట్టారు. కావున ఫేస్బుక్ లో షేర్ అవుతున్న ఫోటో ఎడిట్ చేయబడింది.

ఇదే ఫోటో ని అనేక సందర్భాలలో వివిధ పార్టీలు తమకు నచ్చినట్టుగా ఎడిట్ చేసి వాడుకున్నారు.చివరగా, పోస్ట్ లో ఉన్నట్టుగా బిచ్చగాడు కాంగ్రెస్ కి ఓటు వేస్తానని బెదిరించి బిక్ష అడుక్కోవట్లేదు. ఫోటో ఎడిట్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll