Fake News, Telugu
 

‘టీటీడీ డీఈఓ గా జగన్ బంధువు క్రిస్టోఫర్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ యొక్క బంధువు అయిన క్రిస్టోఫర్ ని టీటీడీ డీఈఓ గా నియమించినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతే కాదు, TV5 న్యూస్ వారు ఈ వార్తను ప్రచురించినట్టు కూడా కొందరు ఫోటోలు పెట్టారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): టీటీడీ డీఈఓ గా జగన్ బంధువు క్రిస్టోఫర్. 

ఫాక్ట్ (నిజం): టీటీడీ డీఈఓ గా క్రిస్టోఫర్ ని నియమించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీటీడీ చైర్మన్ వై.వీ. సుబ్బా రెడ్డి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. అంతే కాదు, TV5 వారు కూడా తాము ప్రచురించింది తప్పు అని వివరణ ఇస్తూ వాళ్ళ వెబ్ సైట్ లో పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, టీటీడీ చైర్మన్ వై.వీ. సుబ్బా రెడ్డి ఈ విషయం పై స్పందిస్తూ ట్వీట్ చేసారని తెలుస్తుంది. ఆ ట్వీట్ లో ‘టిటిడి బోర్డు DEOగా క్రిస్టోఫర్ ను నియమించారు అని ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం’ అని రాసారు. అంతే కాదు, ‘ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాను’ అని కూడా తెలిపారు.

ఫేస్బుక్ లో చాలా మంది టీవీ5 ఆర్టికల్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేస్తున్నారు. కావున, ఆ ఆర్టికల్ గురించి వెతకగా, టీవీ5 వారు ఆ ఆర్టికల్ ని తమ వెబ్ సైట్ నుండి తీసేసినట్టుగా తెలుస్తుంది. అలానే, తాము ప్రచురించింది తప్పు వార్త అంటూ ఒక వివరణను కూడా తమ వెబ్ సైట్ లో పెట్టారు.

చివరగా, ‘టీటీడీ డీఈఓ గా జగన్ బంధువు క్రిస్టోఫర్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll