‘టీటీడీ చైర్మన్ గా కొత్తగా నియమితుడైన వైవీ సుబ్బా రెడ్డి క్రైస్తవ మతస్థుడు’ అంటూ ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయంలో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్ (దావా): టీటీడీ చైర్మన్ గా కొత్తగా నియమితుడైన వైవీ సుబ్బా రెడ్డి క్రైస్తవ మతస్థుడు.
ఫాక్ట్ (నిజం): వైవీ సుబ్బా రెడ్డి ఒక వార్తా పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పుట్టినప్పటి నుండి హిందువునే అని స్వయంగా వెల్లడించారు. అంతే కాకుండా, 2014 లోక్ సభ ఎలక్షన్స్ అప్పుడు తాను ఫైల్ చేసిన అఫిడవిట్ లో కూడా ఈ విషయం తెలుసుకోవొచ్చు. కావున, పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.
తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) బోర్డు కొత్త చైర్మన్ గా నియమితుడైన వై.వి సుబ్బారెడ్డి, వైయస్ జగన్ కి సన్నిహిత బంధువు అవడంతో వైవీ సుబ్బా రెడ్డి కూడా క్రైస్తవ మతస్థుడే అని ప్రచారం జరుగుతోంది. వై.వి.సుబ్బా రెడ్డి ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పుట్టినప్పటి నుంచీ హిందువునే అని తెలియజేసారు. ఇదే విషయాన్ని ఆయన తాను ఒక వార్తా పత్రికకి తన మతం గురించి వెల్లడించిన న్యూస్ క్లిప్ ని పొందుపరిచి ట్వీట్ చేశారు.
— Y V Subba Reddy (@yvsubbareddymp) June 12, 2019
కొన్ని పోస్టుల్లో వైవీ సుబ్బారెడ్డి పూర్తి పేరు యెహోవా విన్సెన్ట్ సుబ్బారెడ్డి అని కూడా పేర్కొంటున్నారు. వైవీ సుబ్బారెడ్డి 2014 లో ఒంగోలు పార్లమెంటరీ స్థానం నుండి ఎంపీ గా ఎన్నికైయ్యాడు. ఆ సమయంలో ఆయన భారత ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ ని చూసినప్పుడు, అతని పూర్తి పేరు యర్రం వెంకట సుబ్బారెడ్డి అని తెలుసుకోవచ్చు.
చివరగా, టీటీడీ చైర్మన్ గా కొత్తగా నియమితుడైన వైవీ సుబ్బా రెడ్డి క్రైస్తవ మతస్థుడు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
where is the news about which party spent how much money in elections? and CBI, EC etc.. are working without partiality? and how much % yearly each state govt got funded from central govt? and recent TDP MP’s merged to BJP in rajya sabha is it comes under BJP ethics? why factly is supporting BJP so badly??