Fake News, Telugu
 

జొమాటో సిబ్భంది ఎజాజ్ ఖాన్ కి బొకే ఇచ్చింది ‘ప్రపంచం మొత్తం ముస్తఫా పాలన వస్తుంది’ అని అన్నందుకు కాదు

0

ప్రపంచం మొత్తం ముస్తఫా పాలన వస్తుంది.. అందరూ ముస్లింలుగా మారిపోవాల్సిందేనని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన #ఎజాజ్‌ఖాన్‌కు అతని ఇంటివద్దకు వెళ్ళి, బొకే ఇచ్చి, సన్మానించి, మద్దతు తెలుపుతున్న #Zomato సిబ్బంది…#BoycottZomato #DeleteZomato” అంటూ ఫేస్బుక్ లో చాలా మంది అజాజ్ ఖాన్ కి జొమాటో సిబ్బంది పూల బొకే ఇస్తున్న ఫోటో పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఆరోపించిన విషయంలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ప్రపంచం మొత్తం ముస్తఫా పాలన వస్తుంది.. అందరూ ముస్లింలుగా మారిపోవాల్సిందేనని హిందువులకు వార్నింగ్ ఇచ్చిన ఎజాజ్‌ఖాన్‌కు అతని ఇంటివద్దకు వెళ్ళి, బొకే ఇచ్చి, సన్మానించి, మద్దతు తెలుపుతున్న జొమాటో సిబ్బంది.

ఫాక్ట్ (నిజం): పోస్టులో పెట్టిన ఫోటో జొమాటో డెలివరీ బాయ్స్ తమ సంస్థ సరైన ఇన్సెంటివ్స్ మరియు సదుపాయాలు కలిపించట్లేదు అంటూ ఎజాజ్ ఖాన్ ని ఆశ్రయించినప్పుడు, అతను వారికి అండగా నిలబడడానికి అంగీకరించినందుకు గాను ఆయన్ని సన్మానించినప్పటిది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.      

పోస్టులో పెట్టిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికినప్పుడు, అది సెప్టెంబర్ 29, 2018లో “Mayapuri.com” అనే వెబ్సైట్ ప్రచురించిన ఒక కథనం లో లభించింది. దాని ఆధారంగా, జొమాటో డెలివరీ బాయ్స్ తమ సంస్థ సరైన ఇన్సెంటివ్స్ మరియు సదుపాయాలు కలిపించట్లేదు అంటూ ఎజాజ్ ఖాన్ ని ఆశ్రయించినప్పుడు, అతను వారికి అండగా నిలబడడానికి అంగీకరించినందుకు గాను ఆయన్ని కృతజ్ఞతతో సన్మానించినప్పటిది అని తెలిసింది. అదే విషయం “Punekar News” వారు రాసిన కథనం లో కూడా చూడవచ్చు.

“International Business times” వారు  జొమాటో డెలివరీ బాయ్స్ కి అండగా ఎజాజ్ ఖాన్ ముందుకు వచ్చాడు అంటూ ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు. అదే విధముగా ఎజాజ్ ఖాన్ ఆ సందర్భంలో పెట్టిన వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

పోస్టులో ఆరోపించిన వ్యాఖ్యలు ఎజాజ్ ఖాన్ చేశాడా అని వెతకినప్పుడు, అజాజ్ ఖాన్ ఖురాన్ లో ప్రపంచం మొత్తం ఇస్లాం రాజ్యంగా మారుతుందని ఉన్నట్లుగా జులై 7, 2019 న ఫేస్బుక్ లైవ్ లో అన్నట్టు తెలిసింది. 

చివరగా, ‘ప్రపంచం మొత్తం ముస్లిం పాలన వస్తుంది’ అని ఎజాజ్‌ ఖాన్ అన్నందుకు అతన్ని జొమాటో సిబ్భంది సన్మానించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll