Fake News, Telugu
 

‘జన్నత్ కి హే ఏ తస్వీర్’ పాటను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించలేదు

0

కాంగ్రెస్ ప్రభుత్వం నిషేదించిన ఒక పాటని ప్రధానమంత్రి మోడీ అందుబాటులోకి తీసుకొని వచ్చారు అని చెప్తూ ఒక పాట వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : ‘జన్నత్ కి హే ఏ తస్వీర్’ అనే పాటను నిషేదించిన కాంగ్రెస్. దాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మోడీ.    

ఫాక్ట్ (నిజం): 1966 లో రిలీజ్ అయిన ‘జోహార్ ఇన్ కాశ్మీర్’ అనే సినిమా లోని ఆ పాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిషేదించలేదు. సెన్సార్ బోర్డు కేవలం కొన్ని పదాలను తీయమని చెప్పింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

పోస్ట్ లోని పాట నుండి, మొదట్లో ఉన్న కొన్ని పదాలను తీసుకొని గూగుల్ లో ‘Jannat ki he yeh tasveer’ అని వెతకగా, ఈ పాట 1966 లో రిలీజ్ అయిన ‘జోహార్ ఇన్ కాశ్మీర్’ సినిమాలోనిదని తెలుస్తుంది.

ఆ సినిమాలో మొహమ్మద్ రఫీ పాటని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించిందా అని వెతకగా, అటువంటి వార్తా ఎక్కడా కూడా దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పినట్టు ఈ పాటను కాంగ్రెస్ నిషేధించినట్టు గానీ, మోడీ మళ్ళీ ఈ పాటను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగానీ ఎక్కడా కూడా సమాచారం లేదు.

పుల్వామా దాడులు జరిగినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులే ఇంగ్లీషు మరియు హిందీ భాషల్లో వైరల్ అయినప్పుడు ‘Altnews’ వారు పాట పాడిన మొహమ్మద్ రఫీ కుమారుడిని సంప్రదించగా, పాటను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపాడు. అంతే కాదు, అప్పటి గెజిట్ డాక్యుమెంట్ లో ఈ పాటలోని కొన్ని పదాలను మాత్రమే సెన్సార్ చేయమని సెన్సార్ బోర్డు చెప్పినట్టు గా చూడవచ్చు.

చివరగా, ‘జన్నత్ కి హే ఏ తస్వీర్’ పాటను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll