Fake News, Telugu
 

జగన్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల మీద కేసీఆర్ కి మద్దతుగా ట్వీట్ చేయలేదు.

0

ఇంటర్మీడియట్  ఫలితాలపై టీ.ఆర్.ఎస్ పార్టీ కి మద్దతుగా వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంటు ద్వారా ట్వీట్ చేసారంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి: “తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కేసీఆర్ గారికి సంబంధం లేదు. కావున కేసీఆర్ గారిని వై.ఎస్.ఆర్.సీ. పీ కార్యకర్తలు ఎవరు ఎం అనోదు అని నా మనవి…”

ఫాక్ట్ (నిజం): జగన్ అసలు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల మీద ఎటువంటి ట్వీట్ చేయలేదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా అది ఒక ఫేక్ ట్వీట్ అని తమ వెబ్ సైట్ లో పెట్టారు. కావున పోస్ట్ లో ఉన్నది అబద్ధం.

వై.ఎస్. జగన్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల మీద ట్వీట్ చేసాడో లేదో తెలుసుకోవడానికి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో వెతకగా, తను దానికి సంబంధించి ఎటువంటి ట్వీట్ చేయలేదని తెలుస్తుంది. తన చివరి ట్వీట్ 21 ఏప్రిల్, 2019 న శ్రీలంక బాంబు దాడుల మీద చేసాడు. అలానే, తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో తన పేరు ‘YS Jagan Mohan Reddy’ అని ఉంటుంది కానీ పోస్ట్ లో ఉన్న ట్వీట్ లో ‘YS Jagan Mohan’ అని ఉంది. కావున పోస్ట్ లో ఉన్నది ఫేక్ ట్వీట్ అనే నిర్ధారణకు రావొచ్చు.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా జగన్ పేరుతో సోషల్ మీడియా లో ఫేక్ ట్వీట్ వైరల్ అవుతుందని తమ వెబ్ సైట్ లో పెట్టారు.

చివరగా, జగన్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల మీద కేసీఆర్ కి మద్దతుగా ట్వీట్ చేయలేదు. అది ఒక ఫేక్ ట్వీట్.

Share.

About Author

Comments are closed.

scroll