ఇద్దరు సైనికులు ఒక చెట్టు కొమ్మపై కూర్చొని విధి నిర్వాహణ చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోని కొందరు ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఒక చెట్టు కొమ్మ పై కూర్చొని విధి నిర్వాహణ చేస్తున్న ఇద్దరు సైనికులు.
ఫాక్ట్ (నిజం): ఒక చెట్టు కొమ్మపై ఇద్దరు సైనికులను ఫోటోషాప్ చేసి పెట్టారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని ఫోటోని క్రాప్ చేసి కేవలం చెట్టు కొమ్మని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అసలు ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. అసలు ఫోటోలో సైనికులు ఉండరు కేవలం చెట్టు మాత్రమే ఉంటుంది. అలానే కేవలం సైనికులను క్రాప్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వాళ్ళు నేలపై కుర్చునట్టుగా ఉన్న ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. కావున రెండు ఫోటోలను తీసుకొని, ఫోటోషాప్ చేసి, తప్పుగా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.
చివరగా, చెట్టు కొమ్మ పై ఇద్దరు సైనికులను ఫోటోషాప్ చేసి పెట్టారు. అది ఒక ఎడిటెడ్ ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?