Fake News, Telugu
 

‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్’ ని ఏర్పాటు చేసినది చిరంజీవి కాదు

0

సినిమా యాక్టర్ చిరంజీవి కొత్తగా విద్యారంగంలోకి అడుగుపెట్టారని, ఆయన పేరిట ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేశారని ఫేస్బుక్ లో చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్’ ని ఏర్పాటు చేసినది చిరంజీవి.

ఫాక్ట్ (నిజం): చిరంజీవి పేరు మీద ఇంటర్నేషనల్ స్కూల్ ని ఏర్పాటు చేసినది ఆయన కాదు, అతని అభిమానులు. అందులో ఆయనకి గౌరవ ఫౌండర్ హోదాని ఇచ్చారు. కావున పోస్ట్ లో ఉన్న ఆరోపణల్లో నిజం లేదు.

ఈ విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు NTv వార్తా సంస్థ వారు ప్రచురించిన ఆర్టికల్ లభించింది. దాని ప్రకారం చిరంజీవికి మరియు ఆయన పేరిట నెలకొల్పిన ఇంటర్నేషనల్ స్కూల్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇదే విషయం గురించి ఆ పాఠశాల వారు తమ అధికారిక వెబ్సైటు లో ఒక సర్కులర్ కూడా పెట్టారు. అందులో ఆ పాఠశాల యాజమాన్యం వారు మెగా కుటుంబం మీద ఉన్న అభిమానం తో వారు ఏర్పాటు చేసిన పాఠశాలకు చిరంజీవి పేరు పెట్టాము అని మరియు ఆయన మీద ఉన్న గౌరవంతో ఆ పాఠశాల బోర్డులో గౌరవ ఫౌండర్ హోదా ఇచ్చాము అని పేర్కొన్నారు.

చివరగా, ‘చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్’ ని ఏర్పాటు చేసినది చిరంజీవి కాదు. ఆయన అభిమానులు.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll