పదనాల్గవ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులలో రాష్ట్రాలకు వాటా పెంచొద్దని చెప్పినా కూడా మోడీ పెంచారంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ని కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా పెంచొద్దన్న ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులను కూడా పక్కన పెట్టి రాష్ట్రాలకు పన్నుల్లో వాటాను 32% నుండి 42% కు మోడీ పెంచారు.
ఫాక్ట్ (నిజం): పదనాల్గవ ఫైనాన్స్ కమిషన్ తమ సిఫర్సులల్లోనే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32% నుండి 42% కు పెంచమని చెప్పింది. దాన్ని మోడీ ప్రభుత్వం అమలు పరిచింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
గూగుల్ అడ్వాన్స్ సెర్చ్ లో ‘14th finance commission full report’ అని వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో పదనాల్గవ ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వం కి ఇచ్చిన ఫుల్ రిపోర్ట్ Volume-1 యొక్క లింక్ వస్తుంది. ఆ రిపోర్ట్ లోని చాప్టర్ 18 లో ఇచ్చిన సిఫార్సులను ను చదివితే మొదటి సిఫార్సు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకి ఇచ్చే వాటా మీద ఉంటుంది. ఆ సిఫార్సులో ఫైనాన్స్ కమిషన్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32% నుండి 42% కు పెంచమని చెప్పింది. దాన్ని మోడీ ప్రభుత్వం అమలు పరిచింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
చివరగా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42% కు పెంచమని ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుని మోడీ ప్రభుత్వం అమలు చేసింది.