Fake News, Telugu
 

తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే నిర్వహించలేదు

0

తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పై తమ సర్వే ఫలితాలు వెలువడించింది అంటూ ఫేస్బుక్ లో ఒక వీడియోని చాలా మందిషేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల మీద తమ సర్వే ని వెలువడించిన తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్. ఆంధ్ర ప్రదేశ్ లో గెలవబోతున్న తెలుగు దేశం పార్టీ.

ఫాక్ట్ (నిజం): తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే ఫలితాలు వెలువడించలేదు. వీడియో సృష్టించిన సంస్థలపై పోలీసు వారు కేసు కూడా ఫైల్ చేసారు. కావున వీడియో లో చూపెట్టిన ఫలితాలలో ఎటువంటి నిజం లేదు.

గూగుల్ లో “Telangana Intelligence Department Survey” అని వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో ‘Telangana Today” వార్త పత్రిక ఈ విషయం పై రాసిన ఆర్టికల్ ఒకటి వస్తుంది. ఆ ఆర్టికల్ ప్రకారం తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే నిర్వహించలేదని తెలుస్తుంది.

ఇంటలిజెన్స్ డిపార్టుమెంట్ పేరుతో ఫేక్ సర్వే వీడియో సృష్టించిన సంస్థల పై పోలీసు వారు కేసులు కూడా బుక్ చేసారు. కావున, పోస్ట్  చేసిన వీడియో లో చెప్పిన సర్వే ఫలితాలలో ఎటువంటి నిజం లేదు.

చివరగా, తెలంగాణ స్టేట్ ఇంటలిజెన్స్ డిపార్టమెంట్ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల పై ఎటువంటి సర్వే నిర్వహించలేదు. వీడియో లోని ఫలితాలు వారు వెలువడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll