Fake News, Telugu
 

ఒక యాడ్ షూట్ లో తీసిన ఫోటోని ‘కలకత్తాలో తన తండ్రిని రిక్షాలో కూర్చోపెట్టి తీసుకెళ్తున్న IAS టాపర్‌’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

ఒక వృద్ధుడు రిక్షా లో కూర్చుని ఉండగా, దానిని ఒక అమ్మాయి లాగుతున్న ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో గురించి పోస్టు లో ఈ విధంగా వివరించారు- “రిక్షాలో కూర్చున్న తను నిజానికి ఆ రిక్షాలో ప్రయాణీకులను తీసుకుని వెళ్తూ రోజుా సంపాదించుకునేవాడు. మరి ఈరోజు అదే రిక్షాలో తను కూర్చుంటే అతని బిడ్డ రిక్షా గుంజి కలకత్తా మహానగరంలో పలు ప్రాంతాలలో అతన్ని తీసుకున వెళ్ళి కృతజ్ఞత చూపింది, తనతండ్రి రిక్షా కార్మికుడని సిగ్గుపడకుండా. కలకత్తా వాసులకి మరియు దేశ వాసులకు ఒక సందేశం పంపింది. ఎందుకో తెలుసా? తండ్రి కష్టంతో తను చదువుకుని ఐఏఎస్ టాపర్గా నిలిచింది మరి! మరి మనం అభినందించాలిగా!”. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : రిక్షాను లాగే అమ్మాయి కోల్‌కతాకు చెందిన ఐఎఎస్ టాపర్.    

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు శ్రమోనా పొద్దార్. ఆమె ఒక యాత్రికురాలు. పోస్టులో పెట్టిన ఫోటో ‘వైల్డ్‌క్రాఫ్ట్’ సంస్థ తమ కంపెనీ బ్యాగుల ప్రచారం కోసం తీసిన యాడ్ షూట్ సందర్భంలో తీసినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.    

ఆ ఫోటోని తొలిసారిగా 2018 లో తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ జె అస్లాం బాషా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. దాని గురించి ఈ వివరణ పెట్టారు- “ఐఏఎస్ టాపర్ తన తండ్రిని ప్రజలకు ఈ విధంగా పరిచయం చేశారు. ఆమెకు మరియు ఆమె తండ్రికి గ్రాండ్ సెల్యూట్.” ఆ ఫోటో గత కొంత కాలంగా అదే వివరణతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

ఆ ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతికినప్పుడు, దానిని 2018 ఏప్రిల్‌లో ‘వైల్డ్‌క్రాఫ్ట్’ సంస్థ తమ కంపెనీ బ్యాగుల ప్రచారం కోసం తీసిన యాడ్ షూట్ సందర్భంలో  తీసినట్లుగా చూడొచ్చు.

ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు శ్రమోనా పొద్దార్. ఆమె ఒక యాత్రికురాలు. ఆ ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘mishti.and.meat’ లో కూడా చూడవచ్చు. అందులో, ఆ ఫోటోని ఒక యాడ్ షూట్ సందర్భంగా తీసినదనీ, కోల్‌కతాలోని శోభా బజార్ వీధుల్లో ఒక రిక్షా పుల్లర్‌ కూర్చుని ఉండగా ఆ రిక్షా ని తాను లాగినట్లుగా తెలిపింది.

చివరగా, ఆ ఫోటోని ఒక యాడ్ షూట్ సందర్భంగా తీసారు. ఫోటోలో ఉన్న అమ్మాయి షరమన్ పొద్దార్. ఆమె ఒక యాత్రికురాలు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll