Fake News, Telugu
 

ఐఏఎఫ్ వాయు దాడుల్లో పాల్గొన్న పైలట్ కి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లేదు

0

పుల్వామా దాడి కి ప్రతీకార చర్యగా  భారత వాయుసేన చేపట్టిన సర్జికల్ దాడుల్లో పాల్గొంది సూరత్ కి చెందిన   ఉర్విషా జర్వాల అంటూ ఫేస్బుక్ లో  చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. అందులో పాల్గొంది  ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): బాలాకోట్ వాయు దాడుల్లో  పాల్గొంది సూరత్ కి చెందిన ఉర్విషా జార్వాల

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఫోటో 2012  భారత  రిపబ్లిక్ డే పరేడ్ లో   ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ను నడిపించిన మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ స్నేహ షెకావత్ ది  గా గుర్తించబడింది. అంతేకాకుండా సైనిక సిబ్బంది మరియు అధికారుల డేటాబేస్ ను కలిగి ఉన్న ‘భారత్  రక్షక్’ అనే వెబ్సైట్  జాబితాలో IAF అధికారిగా షెకావత్ పేరు ఉంది .  ఆమె తన ప్రొఫైల్ లో అదే ఫోటోను ఉపయోగించింది.

భారత వైమానిక దళం గోప్యత కారణంగా  బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న పైలట్ ల పేర్లను  ఎక్కడా కూడా వెల్లడించినట్టుగా సమాచారం లేదు.

చివరగా,  పోస్ట్ లో పెట్టిన ఫోటో ఉర్విష  జార్వాలది కాదు . అది 2012 భారత  రిపబ్లిక్ డే  పరేడ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ను నడిపించిన  స్నేహ షెకావత్ ది. బాలాకోట్ వాయు దాడుల్లో  పాల్గొన్న పైలట్ కి సంబంధించిన సమాచారం  ఎవరూ అధికారికంగా వెల్లడించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll