Fake News, Telugu
 

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా మెయిల్ ID పనిచేస్తుంది. పోస్ట్ లో తప్పు మెయిల్ ID పెట్టడం వల్ల మెయిల్ పోలేదు

0

ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఫిర్యాదులు చేయటానికి ఇచ్చిన మెయిల్ ID పనిచేయడం లేదంటూ ఫేస్బుక్ లో చాలా మంది ఒక పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): భారత దేశ ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల కొరకు ఇచ్చిన మెయిల్ ID పనిచేయటం లేదు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చూస్తే మెయిల్ చేసినప్పుడు ‘complaints’ ప్లేస్ లో ‘complaintsts’ అని తప్పుగా రాసి ఉంది. అందుకే ఆ మెయిల్ వెళ్ళలేదు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

పోస్ట్ లో ఇచ్చిన మెయిల్ ID అసలు అధికారికంగా ఇచ్చారా లేదా అని తెలుసుకోవడానికి ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్ సైట్ లో చూస్తే అదే మెయిల్ ID ఉంటుంది. కానీ పోస్ట్ లో మెయిల్ పంపిన ID సరిగ్గా చూస్తే ‘complaints’ ప్లేస్ లో ‘complaintsts’ అని తప్పుగా రాసినట్టు చూడవచ్చు. తప్పుగా మెయిల్ ID పెట్టినందున మెయిల్ పోలేదని మెసేజ్ వచ్చింది.

ఒక వేల నిజంగానే మెయిల్ ID పనిచేయట్లేదా అని తెలుసుకోవడానికి FACTLY ఆ మెయిల్ ID కి మెయిల్ పంపిస్తే అది వెళ్ళింది. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.

చివరగా, ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా మెయిల్ ID పనిచేస్తుంది. పోస్ట్ లో తప్పుగా మెయిల్ ID పెట్టడం వల్ల మెయిల్ పోలేదు.

Share.

About Author

Comments are closed.

scroll