Fake News, Telugu
 

‘ఇస్కాన్ సంస్థ పై కేసు పెట్టిన పోలాండ్ నన్’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అలా ప్రచురించింది ఒక ‘సెటైరికల్’ వెబ్సైట్

0

శ్రీ కృష్ణుడు నైతికత లేని వ్యక్తి అని ఆరోపిస్తూ ఇస్కాన్ సంస్థపై పోలాండ్ కి చెందిన ఒక నన్ కేసు పెట్టిందనీ, కేసు కోర్టులో న్యాయ విచారణకి వచ్చినప్పుడు మెజిస్ట్రేటుకి ఇస్కాన్ సంస్థ ఇచ్చిన సమాధానానికి వారి పై నమోదైన ఆ కేసుని కొట్టివేసిందని చెప్తూ, కోర్టులో ఇస్కాన్ సంస్థకి, నన్ కి మరియు మెజిస్ట్రేటుకి మధ్య జరిగినట్లుగా ఉన్న సంభాషణని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేస్తున్నారు.దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: శ్రీ కృష్ణుడు నైతికత లేని వ్యక్తి అని ఆరోపిస్తూ ఇస్కాన్ సంస్థపై పోలాండ్ కి చెందిన ఒక నన్ కేసు వేసింది.

ఫాక్ట్ (నిజం): ఇస్కాన్ సంస్థ పై పోలాండ్ కి చెందిన నన్ కేసు పెట్టిందంటూ కథనం ప్రచురించింది ఒక ‘సెటైరికల్’ వెబ్సైట్. అందులో నిజం లేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో పేర్కొన్న విషయం గురించి గూగుల్ లో వెతికినప్పుడు, ఒక సెర్చ్ రిజల్ట్ ద్వారా అదే విషయం గురించి ‘OSHO NEWS’ అనే వెబ్సైట్ కథనం ప్రచురించినట్లుగా తెలిసింది. ఆ కథనంలో, హిందూ మతం ప్రపంచమంతా వ్యాపిస్తున్న తరుణంలో శ్రీ కృష్ణుడు నైతికత లేని వ్యక్తి అని ఆరోపిస్తూ ఇస్కాన్ సంస్థ పై ఒక పోలాండ్ కి చెందిన నన్ కేసు పెట్టిందనీ, కేసు కోర్టులో న్యాయ విచారణకి వచ్చినప్పుడు మెజిస్ట్రేటుకి ఇస్కాన్ సంస్థ ఇచ్చిన సమాధానానికి వారి పై నమోదైన ఆ కేసుని కొట్టివేసిందనీ , కోర్టులో ఇస్కాన్ సంస్థకి, నన్ కి మరియు మెజిస్ట్రేటుకి మధ్య జరిగినట్లుగా ఉన్న సంభాషణని కూడా పెట్టింది. మరియు తాము ప్రచురించిన ఆ కథనం ‘సెటైర్’ అని, అందులో చెప్పిన కథ ‘నిజం కాదు’ అని ఆ వెబ్సైట్ వారు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ,  చాలా మంది ఆ కథ నిజమనుకొని ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్నారు.

చివరగా, ‘ఇస్కాన్ సంస్థ పై కేసు పెట్టిన పోలాండ్ నన్’ అంటూ ఒక సెటైరికల్ వెబ్సైట్ ప్రచురించిన కథనాన్ని నిజం అనుకుని షేర్ చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll