Fake News, Telugu
 

ఇది శ్రీలంక లో జరిగిన పొంగల్ పండగ వేడుకకి సంబంధించిన ఫోటో

0

కొంతమంది ఫేస్బుక్ లో ఒక ఫోటోని పోస్ట్ చేసి ‘చర్చి నిర్మాణం లో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, విఘ్నేశ్వరుడిని పూజిస్తున్న క్రైస్తవులు….. !’ అంటూ అందులో పేర్కొన్నారు. పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): క్రైస్తవులు, వారి చర్చి నిర్మాణం లో ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, విఘ్నేశ్వరుడికి పూజ చేసారు. 

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ఫోటో శ్రీలంక లోని అంపారా జిల్లాకి చెందిన సమ్మాన్తురాయ్ అనే గ్రామంలో జరిగిన పొంగల్ పండగ వేడుకకి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజం లేదు.   

పోస్ట్ లో ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, అది 2016లో  శ్రీలంక లోని అంపారా జిల్లాకి చెందిన సమ్మాన్తురాయ్  గ్రామంలో జరిగిన పొంగల్ పండగ వేడుక కి సంబంధించినదిగా తెలిసింది. ఈ వేడుకలో బౌద్ధ, క్రైస్తవ మరియు ఇస్లాం మత నాయకులు కూడా పాల్గొన్నారు

చివరగా, పోస్టులో పెట్టినది శ్రీలంక లో జరిగిన పొంగల్ పండగ వేడుకకి సంబంధించిన ఫోటో, చర్చి నిర్మాణానికి సంభందించినది కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll