Fake News, Telugu
 

ఆ ఫోటో అమెజాన్ అడవుల్లో ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను రక్షణ సిబ్బంది కాపాడుతున్నది కాదు

0

ఒక వ్యక్తి తన భుజాలపై ఒక ‘ఒరంగుటన్’ ని మోస్తున్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ‘అమెజాన్ అడవుల్లో ప్రమాదంలో పడ్డ మూగ జీవులను కాపాడుతున్న రెస్క్యూ సిబ్బంది’ అని ఆ ఫోటో గురించి వివరణ పెడుతున్నారు. దాంట్లో నిజం ఎంతుందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: అమెజాన్ అడవుల్లో ప్రమాదంలో పడ్డ మూగ జీవులను రెస్క్యూ సిబ్బంది కాపాడుతున్న ఫోటో .

ఫాక్ట్ (నిజం): ఫోటో 2013లో ఇంటర్నేషనల్ జంతువు రెస్క్యూ సిబ్బంది వారు ఇండోనేషియా లోని ‘పామ్’ తోటలలో ఒక ‘ఒరంగుటన్’ ని కాపాడినప్పటిది. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో పెట్టిన ఫోటో ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దానిని ‘rainforest-rescue.org’ అనే స్వచ్చంద సంస్థ వారు ‘ఒరంగుటన్’ సంరక్షణ కోసం వేసిన ఒక పిటీషన్ లో లభించింది. అందులో, ఆ ఫోటో క్రింద ఉన్న వివరణ ద్వారా ఇంటర్నేషనల్ జంతువు రక్షణ వాలంటీర్ లు ఇండోనేషియాలో ఒక ‘ఒరంగుటన్’ ని కాపాడినప్పటిది అని తెలుస్తుంది. దాని గురించి ఇంటర్నేషనల్ జంతువు రక్షణ(IAR) వారి వెబ్సైట్ లో వెతికినప్పుడు, అదే ఫోటో లభించనప్పటికీ,  ‘ఒరంగుటన్’ ని రెస్క్యూ సిబ్బంది మోసుకు వస్తున్నప్పుడు తీసిన మరొక ఫోటో లభించింది. పోస్టులో పెట్టిన ఫోటోని మరియు ఆ వెబ్సైట్ లోని ఫోటోని చూసినట్లయితే, రెండు కూడా ఒకే సందర్భంలో తీసినట్లుగా తెలుస్తోంది.

వెబ్సైటులో ఆ ఫోటోని ఏ సందర్భంలో  తీసినదని చూసినప్పుడు, అందులో ఆ ఫోటో గురించి వివరణ ఏమీ లభించలేదు. కానీ, ‘The Huffpost’ వారు ప్రచురించిన ఒక కథనం ద్వారా అది ఇంటర్నేషనల్ జంతువు రెస్క్యూ సిబ్బంది వారు ఇండోనేషియా లోని ‘పామ్’ తోటలలో ఒక ‘ఒరంగుటన్’ ని కాపాడినప్పటిది అని తెలిసింది.

చివరగా, ఆ ఫోటో అమెజాన్ అడవుల్లో ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను రెస్క్యూ సిబ్బంది  కాపాడుతున్నది కాదు. అది ఇండోనేషియా లోని ‘పామ్’ తోటలలో జంతువు రెస్క్యూ సిబ్బంది వారు ఒక ‘ఒరంగుటన్’ ని కాపాడినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll