Fake News, Telugu
 

ఆ ఆవులు అనంత పద్మనాభ స్వామి దేవాలయంవి కావు. అవి ఆ గుడికి పాలు సరఫరా చేసే ఒక ప్రైవేట్ ట్రస్ట్ యొక్క గోశాల ఆవులు

0

10 లక్షల కోట్ల సంపద కలిగిన తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి వారి దేవాలయం గోసాల గోవులకు గడ్డి పెట్టకుండా చంపుతున్న కమ్మీ సర్కార్..” అంటూ అస్థిపంజర శరీరాలతో ఉన్న ఆవుల ఫోటోని పెట్టిన ఒక ఫేస్బుక్ పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫొటోలో అస్థిపంజర శరీరాలతో ఉన్న ఆవులు తిరువనంతపురం అనంత పద్మనాభస్వామి దేవాలయం గోశాల వారివి.

ఫాక్ట్ (నిజం): ఫోటోలోని ఆవులు అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి పాలు సరఫరా చేసే ఒక ప్రైవేట్ ట్రస్ట్ యొక్క గోశాల ఆవులు. ఆ గోశాల వారు వాటికి సరైన ఆహార సదుపాయాలు కల్పించకపోవడం వలన అవి అలా బక్క చిక్కిపోయాయి. పోస్ట్ లో పెట్టిన ఫోటో కేరళా దేవాలయ శాఖ మంత్రి ఆ ప్రైవేట్ గోశాలను సందర్శించినప్పటిది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాలు ప్రక్కద్రోవ పట్టించేలా ఉన్నాయి.  

గూగుల్ లో కీవర్డ్స్ తో ఈ విషయం గురించి వెతికినప్పుడు, జులై 10, 2019 న ప్రచురితం అయిన “The Hindu” ఆర్టికల్ ఒకటి లభించింది. ఆ కథనం ప్రకారం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం దగ్గరలోని  ‘కుతిర మాలిక’ అనే ప్రాంతంలో ‘శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గోశాల ట్రస్ట్’ అనే ఒక ప్రైవేట్ ట్రస్ట్ నిర్వహించే ఓ గోశాల ఉంది. ఆ గోశాల అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి పాలు సరఫరా చేస్తుంది. అందులో ఉండే ఆవులకు ఆ ప్రైవేట్ ట్రస్ట్ వారు సరైన ఆహార మరియు వసతి సదుపాయాలు కలిపించకపోవడంతో అవి బక్క చిక్కిపోయి చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ గోశాల నిర్వహణ గురించి అనేక ఫిర్యాదులు రావడంతో, ఇటీవలే కేరళ రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి దానిని సందర్శించాడు. పోస్ట్ లో పెట్టిన ఫోటో మంత్రి ‘కుతిర మాలిక’ లోని ఆ ప్రైవేట్ గోశాలను  సందర్శించిన్నప్పుడు తీసినది. ఈ సందర్శనకి సంబంధించిన పూర్తి కవరేజ్ “News18 Malayalam” వారు తమ ఛానల్ లో ప్రసారం చేసిన వార్తా కథనం లో చూడవచ్చు. ఈ విషయాన్నీ చాలా వార్త పత్రికలు కవర్ చేసాయి. న్యూస్ మినిట్, మాతృభూమి, ది హిందూ కూడా దీని గురుంచి రాశాయి. ఈ ఆరోపణలు బయటకి వచ్చాక, కేరళ ప్రభుత్వం ఆ ప్రైవేట్ ట్రస్ట్ కి సంబందించిన గోశాలను టేక్ ఓవర్ చేసింది అని ఆసియానెట్ సంస్థ ఒక వార్త ప్రచురించింది.

ఈ విషయం గురించి “News18 Malayalam” వారు తమ ఛానల్ లో ప్రసారం చేసిన వార్తా కథనానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లో పోస్ట్ లో పెట్టిన ఫోటో ఫోటో చూడవచ్చు.

చివరగా, ఆ ఆవులు అనంత పద్మనాభ స్వామి దేవాలయంవి కావు. అవి ఆ గుడికి  పాలు సరఫరా చేసే ఒక ప్రైవేట్ ట్రస్ట్ యొక్క గోశాల ఆవులు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll