Fake News, Telugu
 

ఆర్డర్ వద్దన్న వ్యక్తిని జోమాటో జైలుకు పంపలేదు. పోలీసు వారు కేసును సుమోటోగా తీసుకొని కేవలం నోటీసు ఇచ్చారు

0

ఒక ముస్లిం డెలివరీ బాయ్ తీసుకువస్తున్న ఆర్డర్ ని వద్దన్న వ్యక్తిని జోమాటో జైలుకు పంపించిందని ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ముస్లిం డెలివరీ బాయ్ తేస్తున్నాడని ఆర్డర్ వద్దన్న వ్యక్తిని జైలుకు పంపిన జోమాటో.

ఫాక్ట్ (నిజం): ఆర్డర్ వద్దన్న వ్యక్తికి CrPC సెక్షన్స్ 107/116 కింద పోలీసు వారు ఒక బాండ్ రాయించి కేవలం నోటీసు మాత్రమే ఇచ్చారు. జైలుకు పంపలేదు. అంతే కాదు, జబల్పూర్ పోలీసులు ఈ కేసును సుమోటో గా తీసుకున్నారు. కావున పోస్ట్ లో ఆ వ్యక్తిని జోమాటో జైలుకు పంపించింది అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.      

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, పోలీసు వారు ఈ కేసును సుమోటో గా తీసుకొని ఆర్డర్ వద్దన్న వ్యక్తి ఇక ముందు అనుచిత వాఖ్యాలు చేయకుండా నోటీసు ఇచ్చారని జబల్పూర్ ఎస్.పీ. అమిత్ సింగ్ మీడియా తో చెప్పినట్టు తెలుస్తుంది.

అమిత్ శుక్లా (ఆర్డర్ వద్దన్న వ్యక్తి) ని ఎస్.డీ.ఎం కోర్టు కి తీసుకువెళ్ళి CrPC సెక్షన్స్ 107/116 కింద పోలీసు వారు ఒక బాండ్ రాయించి కేవలం నోటీసు మాత్రమే ఇచ్చినట్టు ‘The Hindu’ ఆర్టికల్ లో చూడవచ్చు. ఒక వేళ బాండ్ కు విరుద్ధంగా అమిత్ శుక్లా ఏమైనా వాఖ్యలు చేస్తే మాత్రం CrPC సెక్షన్ 122 ప్రకారం జైలుకు పంపుతామని ఎస్.పీ. అమిత్ సింగ్ చెప్పినట్టు తెలుస్తుంది. CrPC సెక్షన్స్ 107 మరియు 116 గురించి ‘The Indian Express’ ఆర్టికల్ లో చదవచ్చు.

చివరగా, ఆర్డర్ వద్దన్న వ్యక్తిని జోమాటో జైలుకు పంపలేదు. పోలీసు వారు కేసును సుమోటో గా తీసుకొని నోటీసు ఇచ్చారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll