ఈ నెల ఆఖరులోగా పెండింగ్ చలాన్లు కట్టకుంటే, పాత జరిమానాలు అన్నీ కొత్త చట్టం ప్రకారం కొత్త ధరలతో రెట్టింపు చేయబడుతాయని, కావున పెండింగ్ చలాన్లు అన్నీ ఆగష్టు 31 లోగా చెల్లించాలని తెలంగాణ పోలీసు శాఖ వారు వాహనదారులను విజ్ఞప్తి చేస్తున్నట్టు ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: తెలంగాణ పోలీసు శాఖ: ‘ఆగష్టు 31 లోగా పెండింగ్ చాలనాలు కట్టకుంటే, పాత జరిమానాలు అన్నీ కొత్త చట్టం ప్రకారం కొత్త ధరలతో రెట్టింపు చేయబడును.’
ఫాక్ట్ (నిజం): సోషల్ మీడియాలో వైరల్ ఈ మెసేజ్ ఒక ఫేక్ వార్త అని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు వారు ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఈ మెసేజ్ పై స్పందిస్తూ హైదరబాద్ ట్రాఫిక్ పోలీసు వారు ట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్వీట్ ద్వారా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ఒక ఫేక్ వార్త అని తెలుస్తుంది.
#HYDTPinfo The below message which is circulating in Social Media is “FAKE”. @AddlCPTrHyd pic.twitter.com/6UWOTrLm3k
— Hyderabad Traffic Police (@HYDTP) August 27, 2019
కొత్త చట్టం (Motor Vehicles (Amendment) Act, 2019) ద్వారా పెరిగిన చలాన్ల గురించి తెలుసుకోవాలంటే, ఈ విషయం పై FACTLY రాసిన ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు.
చివరగా, ఆగష్టు 31 లోగా పెండింగ్ చలాన్లు కట్టకుంటే, పాత జరిమానాలు అన్నీ కొత్త చట్టం ప్రకారం కొత్త ధరలతో రెట్టింపు చేయబడును అని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?