Fake News, Telugu
 

‘అమెజాన్, స్విగ్గీ మరియు జోమాటో లాంటివి వరదల్లో ఏ మాత్రం సహాయపడలేదు….’ అంటూ అజిత్ దోవల్ వ్యాఖ్యలు చేయలేదు.

0

అమెజాన్, స్విగ్గీ మరియు జోమాటో మీద నేషనల్ సెక్యూరిటీ అడ్వైసర్ అజిత్ దోవల్ వ్యాఖ్యలు చేసినట్టు ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : అజిత్ దోవల్: “అమెజాన్, స్విగ్గే, జొమాటో లాంటివి వరదల్లో ఏ మాత్రం సహాయపడలేదు. కాబట్టి, చిన్న వ్యాపారులకు మీ బిజినెస్ ఇవ్వండి.”.       

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వ్యాఖ్యలను అజిత్ దోవల్ అన్నట్టుగా ఎక్కడా కూడా రిపోర్ట్ అవ్వలేదు. అజిత్ దోవల్ అన్నట్టుగా పోస్ట్ లో ఉన్న వ్యాఖ్యలను ‘Ajit Doval’ (@AjitKDoval_NSA) పేరుతో ఉన్న అజిత్ దోవల్ అభిమాన సంఘం యొక్క ట్విట్టర్ అకౌంట్ నుండి తీసుకున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వ్యాఖ్యలను అజిత్ దోవల్ ఎక్కడైనా అన్నరా అని వెతకగా, తను అలా అనట్టుగా ఎక్కడా కూడా రిపోర్ట్ అవ్వలేదు. కానీ, ఇవే వ్యాఖ్యలను ‘Ajit Doval’ (@AjitKDoval_NSA) అనే ట్విట్టర్ అకౌంట్ ట్వీట్ చేసినట్టు చూడవచ్చు. ఆ ట్విట్టర్ అకౌంట్ ని పరిశీలించగా అది అజిత్ దోవల్ ని అభిమానించే వారు నడిపిస్తున్నారని తెలుస్తుంది.

ఇంతకుముందు కూడా ఈ అకౌంట్ లో పోస్ట్ చేసినవాటిని నిజంగానే అజిత్ దోవల్ అన్నట్టుగా ప్రచారం చేసినప్పుడు, ప్రధానమంత్రి ఆఫీసుకి FACTLY కాల్ చేసి అడగగా, అసలు అజిత్ దోవల్ కి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లేదని వారు తెలిపారు. అజిత్ దోవల్ పేరుతో ఇంతకుముందు ప్రచారం అయిన ఫేక్ వార్తల పై FACTLY రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవచ్చు.

చివరగా, ‘అమెజాన్, స్విగ్గీ మరియు జోమాటో లాంటివి వరదల్లో ఏ మాత్రం సహాయపడలేదు….’ అంటూ అజిత్ దోవల్ వాఖ్యలు చేయలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll