ప్రజలు వాడే వివిధ బ్యాంకుల డెబిట్ కార్డుల మీద బీమా పొందవచ్చని చెప్తూ ఉన్న వీడియోని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): బ్యాంకులు ఇచ్చే వివిధ డెబిట్ కార్డుల మీద వినియోగదారులు జీవిత బీమా పొందవచ్చు.
ఫాక్ట్ (నిజం): డెబిట్ కార్డు ఉన్న వినియోగదారులు ఆక్సిడెంట్ లో మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం చెందుతే బ్యాంకుల ద్వారా బీమా పొందవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి. వివిధ బ్యాంకులు డెబిట్ కార్డుని బట్టి బీమా మొత్తాన్ని లెక్కిస్తారు. పోస్ట్ లో చెప్పింది నిజమే కానీ పోస్ట్ లో చెప్పినట్టుగా అన్ని బ్యాంకుల్లో బీమా మొత్తం మరియు క్లెయిమ్ చేయడానికి అర్హతలు ఒకేలా లేవు.
పోస్ట్ లోని విషయాల కోసం గూగుల్ లో ‘Debit Card Insurance’ అని వెతకగా, వివిధ బ్యాంకుల వెబ్ సైట్ లింకులు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. వాటి ప్రకారం వినియోగదారులు వాడే డెబిట్ కార్డు మీద బ్యాంకు జీవిత/ శాశ్వత వైకల్యం బీమా ఇస్తుందని తెలుస్తుంది. దాంట్లో కూడా ఎయిర్ మరియు నాన్-ఎయిర్ అని విభాగాలు ఉన్నాయి. అంతే కాదు, డెబిట్ కార్డు పై కొన్ని బ్యాంకులు ‘Purchase Protection Cover’ కూడా ఇస్తాయి. కావున డెబిట్ కార్డు పై వినియోగదారులు ఆక్సిడెంట్ జరుగుతే జీవిత బీమా పొందవచ్చు. కానీ బీమా పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. కావున పోస్ట్ లో చెప్పింది నిజమే. కానీ వీడియో లో చెప్పినట్టు అన్ని బ్యాంకులు ఏటీఎం వాడిన 45 రోజులలో ఆక్సిడెంట్ జరిగితే బీమా ఇవ్వవు, ప్రతి బ్యాంకులో అర్హతకి షరతులు వేరేల ఉన్నాయి. కొన్ని బ్యాంకుల షరతులు మరియు బీమా రకాలను కింద చూద్దాము:
చివరగా, డెబిట్ కార్డు ఉన్న వినియోగదారులు ఆక్సిడెంట్ లో మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం చెందుతే బ్యాంకుల ద్వారా బీమా పొందవచ్చు. కానీ షరతులు వర్తిస్తాయి.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?