Fake News, Telugu
 

అది ఆకాశం నుంచి భూమి మీదకు పడుతున్న నీటి ధార కాదు.

0

దక్షిణాఫ్రికాలోని టోగో దగ్గర ఆకాశం నుంచి భూమి మీదకు ఒకే ప్రదేశంలో బిందెలోనుంచి నీళ్లు పోసిన్నట్టు ధార పడింది అని, దేవుడు ఉన్నాడు అనడానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేం కావాలి అని ఒక వీడియో ని చాలా మంది ఫేసుబుక్ లో షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో ఆర్చివ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు

క్లెయిమ్ (దావా): దక్షిణాఫ్రికాలోని టోగో దగ్గర ఆకాశం నుంచి భూమి మీదకు ఒకే ప్రదేశంలో బిందెలోనుంచి నీళ్లు పోసిన్నట్టు ధార పడింది. దేవుడు ఉన్నాడు అనడానికి ఇంత కంటే నిదర్శనం ఇంకేం కావాలి

ఫాక్ట్ (నిజం): అది ఆకాశం నుంచి భూమి మీదకు పడుతున్న నీటి ధార కాదు. కింది నుంచే పగిలిన పైప్ వల్లనో, లేదా ఒక ‘హాట్ స్పీరింగ్’ నుంచి ఎగిరి పడుతున్న నీళ్లు. ఇటువంటి వీడియో లు 2015 నుంచి చెలామణీ లో ఉన్నాయి. కాబట్టి పోస్టులో చెప్పింది నిజం కాదు.

ఇటువంటి వీడియో లు 2015 నుంచి యూట్యూబ్ లో , వేరే సోషల్ మీడియా సైట్లలో చెలామణీ లో ఉన్నాయి. కొంత మంది ఇది దక్షిణాఫ్రికా లోని టోగో లో జరిగింది అని, ఇంకొంత మంది వియత్నాం లో జరిగింది అని, మరి కొంత మంది చైనా లో జరిగింది అని, ఇంకొంత మంది ఎక్కడో ఇస్లామిక్ దేశంలో జరిగింది అని 2015 నుంచి ప్రచారం చేస్తున్నారు.

అందరు ఇది దేవుని మహిమ తో జరిగింది అని, దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అని ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలోని కీ ఫ్రేమ్స్ ని మనం ఇన్విడ్ సాఫ్ట్వేర్ ద్వారా తీసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, పైన చెప్పిన వీడియోలన్నీ వస్తాయి. ఆ వీడియోలను ఫ్రేమ్ల వారీగా చూస్తే, వేరు వేరు టైం లలో ఆ ధార యొక్క అంచును చూడొచ్చు. మేఘాలు ఉండడం వల్ల ఆకాశం నుండి వచ్చినట్టుగా కనిపిస్తుంది.

ఇంకొన్ని ఫ్రేమ్ లలో కింది నుంచి ప్రెషర్ తో వస్తున్న నీళ్లను కూడా చూడొచ్చు. కాబట్టి, అసలు ఇవి ఆకాశం నుండి వచ్చే నీళ్లు కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. అంతే కాదు, ఇటువంటి ఒక వీడియో ఘానా దేశంలో కూడా ప్రచారం ఐంది. ఘానా కి చెందిన ఒక రిపోర్టర్ దీన్ని ఘానా వాటర్ కంపెనీ పైప్ లైన్ పగలడం వాళ్ళ వచ్చే ధార అని ప్రూవ్ చేసి వీడియో పెట్టాడు. అదే వీడియోని వేరే యాంగిల్ లో కూడా తీసి పెట్టాడు.

చివరగా, అసలు ఇది ఆకాశం నుంచి వచ్చే ధార కాదని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాబట్టి దేవునికి ఈ ధారకు సంబంధం లేదు. స్నోప్స్ అనే అమెరికా ఫాక్ట్ చెకింగ్ సంస్థ కూడా దీన్ని ఇంతకు ముందు వెరిఫై చేసి తప్పు అని చెప్పింది.

Share.

About Author

Rakesh has been working on issues related to Right to Information (RTI) for a decade. He is a Data/Information enthusiast & passionate about Governance/Policy issues.

Comments are closed.

scroll