హిందుస్థాన్ యూనీలీవర్ లిమిటెడ్(HUL) వారు హోలీ పండగ ఆధారంగా ఇటీవల తీసిన సర్ఫ్ ఎక్సెల్ యాడ్ దుమారం లేపుతోంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా యాడ ఉందని సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఈ వివాదం వల్ల ఇప్పటివరకు 10 కోట్ల మేరకు HUL నష్టపోయిందని Times of India సంస్థ ట్వీట్ చేసిందంటూ ఫేస్బుక్ లో ఒక పోస్ట ని చాలా మంది షేర్ చేస్తున్నారు. దాంట్లో నిజం ఎంతుందో ఓసారి విశ్లేషిద్దాం.
ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
క్లెయిమ్ (దావా): హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా యాడ్ తీసినందుకు సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పటివరకు 10 కోట్ల మేరకు HUL నష్టపోయింది అంటూ Times of India సంస్థ ట్వీట్ చేసింది.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని అసలు Times of India సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో పెట్టలేదు. అది వేరేవారు సృష్టించిన ట్వీట్. సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వలన HUL 10 కోట్లు నష్టపోయిందని ఎక్కడా కూడా అధికారిక సమాచారం వెల్లడవ్వలేదు. కావున పోస్ట్ లో ఆరోపించినవి అవాస్తవాలు.
పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని Times of India వార్తా సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెతికినప్పుడు ఎక్కడా లభ్యం అవలేదు. అయినప్పటికీ ఆ వార్తా సంస్థ తాము పెట్టిన ట్వీట్ ని తొలగించే అవకాశాలు లేకపోలేదు. కావున ఫేస్బుక్ పోస్ట్ లోని ట్వీట్ ని నిజ నిర్ధారణకై గూగుల్ లో వెతికినప్పుడు Altnews వారు రాసిన ఆర్టికల్ వస్తుంది. దాని ప్రకారం క్రింది చిత్రంలో ఎడమ వైపు(TOI ట్విట్టర్ అకౌంట్ లోని ఒక శాంపిల్ ట్వీట్) ఉన్న ట్వీట్ లో వాక్యాల క్రమం మరియు TOI లోగో ఒక స్ట్రెయిట్ లైన్ లో ఉన్నాయి. అదే కుడి వైపు ఉన్న ట్వీట్(social media లో వ్యాప్తిలో ఉన్న ట్వీట్) లో వాక్యాల క్రమం మరియు TOI లోగో కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీనిని బట్టి ఫేస్బుక్ పోస్ట్ లో ఉన్న ట్వీట్ తప్పుదోవ పట్టించడానికి సృష్టించబడినది అని చెప్పవచ్చు. ట్వీట్ లో పేర్కొన్నట్టు సర్ఫ్ ఎక్సెల్ ని బాయ్కాట్ చేయడం వలన HUL10 కోట్ల మేరకు నష్టపోయిందని ఎక్కడా అధికారిక సమాచారం వెల్లడవ్వలేదు
ఆ ట్వీట్ తాము ప్రచురుంచలేదని TOI అధికారికం వివరిస్తూ ఈ ఆర్టికల్ రాసింది
చివరగా,ఫేస్బుక్ పోస్ట్ లో ఉన్న ట్వీట్ ని Times of India వార్తా సంస్థ తమ ట్విట్టర్ ఖాతా లో పెట్టలేదు.