Fake News, Telugu
 

ఈ పోలింగ్ బూత్ ఘటన హర్యానా లోని ఫరీదాబాద్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్ లో కాదు

0

భారతదేశంలో రాజకీయాలు ఎంత ఘోరంగా ఉన్నయో చూడండి అంటూ ఒక బూత్ క్యాప్చర్  వీడీయో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి అది పశ్చిమ బెంగాల్ లో జరిగింది అంటూ కొంతమంది పేర్కొంటున్నారు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): వీడియోలోని బూత్ క్యాప్చర్ సంఘటన పశ్చిమ బెంగాల్ లో జరిగింది.

ఫాక్ట్ (నిజం): ఈ బూత్ క్యాప్చర్ ఘటన హర్యానా రాష్ట్రం లోని ఫరీదాబాద్ లో జరిగింది. కానీ ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో జరిగిందంటూ కొంతమంది ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు.

పోస్టులో ఉన్న వీడియోని ఇన్విడ్  ప్లగిన్ లో రన్ చెయ్యగా, వచ్చిన కీ ఫ్రేమ్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా వచ్చిన సమాచారం ఆధారంగా వెతికిన్నప్పుడు పోస్ట్ లో పేర్కొన్న ఘటనకి సంబంధించి NDTV వార్తా సంస్థ వారి ఒక కథనం లభించింది. దీని ప్రకారం వీడియోలో చూసిన బూత్  క్యాప్చర్ ఘటన హర్యానా రాష్ట్రం లో జరిగింది. ఆ బూత్ లోని పోలింగ్ ఏజెంట్ ఓటు వెయ్యడానికి వచ్చిన మహిళల ఓట్లను తానే “కమలం” గుర్తుకు వేసాడు అని తెలిసింది.

ఈ విషయం గురించి “District Election Office Faridabad” వారు ఒక ట్వీట్ కూడా చేసారు.

చివరగా, వీడియో లోని బూత్ క్యాప్చర్ ఘటన హర్యానా లోని ఫరీదాబాద్ లో జరిగింది. పశ్చిమ బెంగాల్ లో కాదు.

ప్రతి వారం, మేము ‘ఏది ఫేక్, ఏది నిజం’ అనే తెలుగు యూట్యూబ్ షో చేస్తున్నాం. మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll