Fake News, Telugu
 

ఆ వీడియో ‘అలెన్ అల్ ఖాయ్ ఎడారి’ కి సంబంధించినది కాదు. అందులో ఉన్నది అగ్నిపర్వత బూడిదతో నిండి ఉన్న ‘నహుయేల్ హ్యూపీ సరస్సు’

0

కొంతమంది ఫేస్బుక్ లో ఒక వీడియో ని పోస్ట్ చేసి అందులో ప్రవహిస్తూ కనిపిస్తున్నది నీరు కాదని, ఇసుక అంటూ పేర్కొంటున్నారు. ఆ ప్రాంతాన్ని అలెన్ అల్ ఖాయ్(పిశాచి ఎడారి) అంటారనీ, అది దక్షిణ అరేబియా (సౌదీ అరేబియా) సరిహద్దుల్లో ఉంటుందని కూడా పేర్కొన్నారు. ఆ పోస్ట్ లో చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): వీడియోలో ఉన్నది అలెన్ అల్ ఖాయ్ అనే ఎడారి, అక్కడ ఇసుక నీటి లాగ ప్రవహిస్తుంది.

ఫాక్ట్ (నిజం): వీడియోలో ఉన్నది ఎడారి కాదు. అందులో ఉన్నది ఆర్జెంటినా లో ఉన్న నహుయేల్ హ్యూపీ సరస్సు. పోస్ట్ లోని వీడియోని 2011 లో చిలి దేశంలో ఉన్న పుయెహ్యూ అగ్నిపర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద నహుయేల్ హ్యూపీ  సరస్సు నీటితో కలిసినప్పుడు చిత్రీకరించినది. కావున, పోస్ట్ లో పేర్కొన్న విషయాల్లో నిజం లేదు.

పోస్ట్ లో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేయగా, వచ్చిన కీ ఫ్రేమ్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఆ వీడియో “Lake of ash” కి సంబంధించినదని చాలా లింక్స్ వచ్చాయి. ఆ సమాచారం ఆధారంగా గూగుల్ లో వెతికినప్పుడు, “The Telegraph” పత్రిక  జూన్ 16, 2011న పోస్ట్ లో ఉన్న వీడియోని పెట్టి, దాని గురించి ప్రచురించిన ఒక కథనం లభించింది. దాంట్లో, అర్జెంటీనాలోని ‘నహుయేల్ హ్యూపీ సరస్సు’ నీరు పొరుగు దేశం చిలీలోని పుయెహ్యూ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా వచ్చిన బూడిదతో కలిసిందని ఉంటుంది.

చివరగా, ఆ వీడియో ‘అలెన్ అల్ ఖాయ్ ఎడారి’ కి సంబంధించినది కాదు. అందులో ఉన్నది అగ్నిపర్వత బూడిదతో నిండి ఉన్న ‘నహుయేల్ హ్యూపీ సరస్సు’

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll