Fake News, Telugu
 

పాకిస్థాన్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయిన దృశ్యాలని చెప్తూ యెమెన్‌లో ఇజ్రాయెల్ దాడి వీడియోలని షేర్ చేస్తున్నారు

0

మే 2025 భారత్-పాక్ సంఘర్షణ నేపథ్యంలో పాకిస్తాన్‌లోని కిరాణా హిల్స్‌లో ఉన్న అణు కేంద్రంపై భారత్ దాడి చేసిందని, సోషల్ మీడియాలో చలామణిలో ఉన్న పుకార్లలో (ఇక్కడ, ఇక్కడ) నిజంలేదని 12 మే 2025న జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారతీయ ఎయిర్ మార్షల్ A.K భారతి చెప్పారు.

ఈ నేపథ్యంలో ‘అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయిందని పాకిస్తాన్ అంగీకరించింది’ అని చెప్తూ, కొన్ని వాహనాలు, భవనాలు మంటల్లో కనిపిస్తున్న దృశ్యాలున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే వీడియోని కొందరు ‘X’ యూజర్లు షేర్ చేస్తూ, మన బ్రాహ్మోస్ మిసైల్ పాకిస్థాన్ యొక్క న్యూక్లియర్ కమాండ్ సెంటర్ సమీపంలో పడిందని చెప్తూ షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్‌లోని అణు కేంద్రంపై భారత్ చేసిన దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూపిస్తున్న వీడియో. 

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోకు పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదు. 6 మే 2025న యెమెన్ దేశంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో జరిగిన విధ్వంసానికి చెందిన వీడియో ఇది. పాకిస్తాన్‌లోని కిరాణా హిల్స్‌పై తాము దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానుజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించిన ఇంటర్నెట్లో వెతకగా, వైరల్ వీడియోలోని దృశ్యాలు పాకిస్తాన్‌లో ఉన్న అణు కేంద్రంపై భారత్ చేపట్టిన దాడివి అని చెప్తూ మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు దొరకలేదు.

ఇక వైరల్ వీడియోలోని దృశ్యాల గురించి మరిన్ని వివరాల కోసం అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇట్నర్నెట్లో వెతుకగా, ఈ వీడియోలన్నీ 6 మే 2025న, యెమెన్ దేశంలో ఇజ్రాయెల్  చేసిన వైమానిక దాడుల్లో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) జరిగిన విధ్వంసానికి చెందినవని మాకు తెలిసింది.

ఈ సెర్చ్ ద్వారా మాకు వైరల్ వీడియోలోని దృశ్యాలు ఉన్న అనేక వార్తా లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ వార్తా కథనాల ప్రకారం, 6 మే 2025న హౌయితీల నియంత్రణలో ఉన్న యెమెన్ దేశ రాజధాని సనాలోని విమానాశ్రయంతో పాటు పలు చోట్ల, ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో జరిగిన విధ్వంసాన్ని చూపిస్తున్న అనేక దృశ్యాలు వైరల్ వీడియోలో ఉన్నాయి.

అసోసియటెడ్ ప్రెస్, ఆల్-జజీరా, viory, ది స్ట్రయిట్స్ టైమ్స్ వంటి మీడియా సంస్థలతో పాటు యెమెన్ టుడే, ఆల్ మసీరా టీవీ వంటి యెమెన్ దేశ మీడియా సంస్థలు కూడా ఈ వీడియోలను పోస్ట్ చేశాయి(ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ). 

చివరగా, పాకిస్థాన్ అణు విద్యుత్ కేంద్రం నుంచి రేడియేషన్ లీక్ అయిన దృశ్యాలని యెమెన్‌లో ఇజ్రాయెల్ దాడికి చెందిన వీడియోలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll