Fake News, Telugu
 

డోనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్ పర్యటనకి ఈ తోపుడు బండ్ల ధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదు

0

కొంత మంది అధికారుల సమక్షంలో తోపుడు బండ్లను ఒక జెసిబి ధ్వంసం చేస్తున్న వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం, అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటించనుండడంతో, ఫూట్ పాత్ వ్యాపారుల తోపుడు బండ్లను ధ్వంసం చేస్తున్నారని దాని గురించి పేర్కొంటున్నారు. పోస్టులో చెప్పిన విషయంలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: అహ్మదాబాద్ లో ట్రంప్ పర్యటించనుండడంతో గుజరాత్ ప్రభుత్వం ఫూట్ పాత్ వ్యాపారుల తోపుడు బండ్లను ధ్వంసం చేయిస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): వీడియో అసలు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినదే కాదు. అది భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వారు చేపట్టిన ఒక ‘తొలగింపు’ చర్యది. కావున, వీడియో ఒడిశా రాష్ట్రానికి సంబంధించినది. పోస్టులో చెప్పింది తప్పు.    

యూట్యూబ్ లో ‘Fruit vendor carts destroyed by authorities’ అని వెతికినప్పుడు, ఒడియా న్యూస్ ఛానెల్ ‘OTV’ వారి వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. అది పోస్టులోని వీడియోలో ఉన్న ఘటనకి సంబంధించినదే, కానీ దానిని వేరే యాంగిల్ నుండి చిత్రీకరించారు. ఆ వీడియో టైటిల్ ద్వారా, అది భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వారు చేపట్టిన ఒక ‘తొలగింపు’ చర్య లో భాగంగా, ఫూట్ పాత్ వ్యాపారుల తోపుడు బండ్లను అధికారులు ధ్వంసం చేయడానికి సంబంధించినదని తెలిసింది. కావున, వీడియో ఒడిశా రాష్ట్రానికి సంబంధించినది.

పోస్టులోని వీడియో వైరల్ అవ్వడంతో, తప్పుడు ఆరోపణతో మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా లో పోస్టు చేసిన వ్యక్తిని క్రైమ్ బ్రాంచ్ వారు అరెస్ట్ చేసినట్లుగా ‘Times of India’ కథనం లో చూడవచ్చు.

చివరగా, పోస్టులోని వీడియో అసలు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినదే కాదు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll