Deepfake, Fake News, Telugu
 

ప్రధాని మోదీ యేసుక్రీస్తును కీర్తిస్తున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడింది

0

భారతదేశ ప్రధాని మోదీ యేసుక్రీస్తును కీర్తిస్తూ వ్యాఖ్యానించినట్లు చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రధాని మోదీ యేసుక్రీస్తును కీర్తిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఫేక్. అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించారు. అసలు వీడియో 03 జూన్ 2022న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వగ్రామం పరూంఖ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగాన్ని చూపిస్తుంది. ఈ ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీ ఎక్కడా యేసుక్రీస్తు గురించి మాట్లాడలేదు. అయితే, అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి మోడీ యేసుక్రీస్తును కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియోను ప్రధాని మోదీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ 03 జూన్ 2022న షేర్ చేసినట్లు గుర్తించాము. వైరల్ వీడియోలో కనిపించే దృశ్యాలను ఈ వీడియోలో టైంస్టాంప్ 1:40 నుండి టైంస్టాంప్ 2:40 మధ్య మనం చూడవచ్చు. ఇదే వీడియోను భారత పార్లమెంట్, భారత రాష్ట్రపతికి సంబంధించిన అధికారిక యూట్యూబ్ ఛానల్స్ కూడా 03 జూన్ 2022న షేర్ చేసినట్లు గుర్తించాము (ఇక్కడ, ఇక్కడ). ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వీడియో 03 జూన్ 2022న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వగ్రామం పరూంఖ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ చేసిన ప్రసంగాన్ని చూపిస్తుంది.

ఈ ప్రసంగం మొత్తంలో ప్రధానమంత్రి మోదీ ఎక్కడా యేసుక్రీస్తు గురించి మాట్లాడలేదు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వార్త కథనాలను ఇక్కడఇక్కడ,ఇక్కడ చూడవచ్చు. ఈ సభలో ప్రధాని మోదీ చేసిన పూర్తి ప్రసంగాన్ని ఇక్కడ(తెలుగు), ఇక్కడ(హిందీ), & ఇక్కడ(ఇంగ్లీష్) చూడవచ్చు.

దీన్ని బట్టి అసలు వీడియోకు AI జనరేటెడ్ ఆడియోను జోడించి ఈ వైరల్ వీడియోను రూపొందించినట్లు అర్థమవుతుంది. తదుపరి, ఈ వైరల్ వీడియోలోని ఆడియోను AI- ఉపయోగించి తయారు చేశారా? లేదా? అని నిర్ధారించడానికి, HiveResemble AI, & Hiya వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వీడియోను పరిశీలించగా, ఈ వైరల్ వీడియోలోని ఆడియో AI-జనరేటెడ్ ఆడియో కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి.

అయితే, అనేక సందర్భాల్లో, ప్రధానమంత్రి మోడీ యేసుక్రీస్తును కీర్తిస్తూ వ్యాఖ్యలు చేశారు (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, ప్రధాని మోదీ యేసుక్రీస్తును కీర్తిస్తూ వ్యాఖ్యానించినట్లు చూపిస్తున్న ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll