ఒక స్ట్రీట్ ఫుడ్ తయారీదారుడు తన పాదాలతో పావ్ భాజీని తయారు చేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తున్నట్లు పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఒక స్ట్రీట్ ఫుడ్ తయారీదారుడు తన పాదాలతో పావ్ భాజీని తయారు చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన దృశ్యాలను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ‘Sora’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వీడియో AI ద్వారా రూపొందించబడిందని AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, వీడియోలో ‘Sora’ అనే వాటర్‌మార్క్‌ను మనం చూడవచ్చు. ఈ వాటర్‌మార్క్ ఈ వైరల్ వీడియోను OpenAI వారి ‘Sora’ AI మోడల్‌ను ఉపయోగించి రూపొందించబడిందని సూచిస్తుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).అలాగే, ఈ వీడియోలో ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో మనం సహజంగానే ఇటువంటి లోపాలను చూడవచ్చు (ఇక్కడ, ఇక్కడ).

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.5% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఒక స్ట్రీట్ ఫుడ్ తయారీదారుడు తన పాదాలతో పావ్ భాజీని తయారు చేస్తున్నట్లు చూపిస్తున్న ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడింది.