సైకిల్ తొక్కుతున్న వ్యక్తి యొక్క శిల్పాన్ని షేర్ చేస్తూ ఇది తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయ గోడపై ఉంది అని, పైగా సైకిల్ కనిపెట్టింది 200 క్రితం అయితే ఈ శిల్పం 2000 సంవత్సరాల క్రితం చెక్కబడింది అంటూ సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఎంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయ గోడపై 2000 సంవత్సరాల నాటి సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి శిల్పం ఉంది.
ఫాక్ట్ (నిజం): ఈ శిల్పం తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయంలోది కాదు. ఇది నైజీరియాలోని యోరుబా కళాకారుడు దాదా అరేగున్ ఒక ప్యాలెస్ తలుపుపై చెక్కిన చెక్క శిల్పం. ఇది సుమారు వంద సంవత్సరాల క్రితం నాటిది. ఇది రాజు తన ప్రజలను పాలించగల సామర్థ్యం కలవాడైన కారణంగా సమాజంలోని అన్ని అంశాలు బాగా పనిచేస్తున్నాయని చూపించడానికి నిదర్శనంగా చెక్కింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
వైరల్ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ఇది నైజీరియాలోని యోరుబా కళాకారుడు దాదా అరేగున్ ఒక ప్యాలెస్ తలుపుపై చెక్కిన చెక్క శిల్పం అని BBC కథనం ద్వారా తెలుసుకున్నాం. BBC ఈ ఫోటోను ప్రచురిస్తూ “1924లో నైజీరియాలోని ఎకిటి స్టేట్‌లోని ఓసి గ్రామానికి చెందిన దాదా అరేగున్ చెక్కిన చెక్క తలుపు ప్యానెల్ ” (అనువాదం) అని వివరించింది.

‘ది మిన్నియాపాలిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్’ వెబ్సైట్ ద్వారా, సుమారు వంద సంవత్సరాల క్రితం ఓసికి చెందిన ప్రసిద్ధ యోరుబా కళాకారుడు అరేగున్ చేత ఈ తలుపు చెక్కబడింది అని తెలుసుకున్నాం. దీని ప్రకారం, ఇది రాజు తన ప్రజలను పాలించగల సామర్థ్యం కలవాడైన కారణంగా సమాజంలోని అన్ని అంశాలు బాగా పనిచేస్తున్నాయని చూపించడానికి నిదర్శనంగా చెక్కింది. ఈ తలుపుపై రాజు చేతిలో కత్తి, పిస్టల్ పట్టుకొని, సిగరేట్ పైపు కాలుస్తూ మోటారుసైకిల్ మరియు గుర్రంపై స్వారీ చేస్తుంటే, ఇద్దరు వ్యక్తులు వాణిజ్య వస్తువులతో నిండిన పెట్టెలను మోసుకెల్లే దృశ్యాన్ని చూపిస్తుంది అని తెలిసింది.

గతంలో, ఇటువంటి సైకిల్ శిల్ప దృశ్యాలకు సంబంధించిన క్లెయిమ్‌లను ఫ్యాక్ట్లీ ఫాక్ట్ – చెక్ చేసింది .
చివరిగా, ఈ సైకిల్‌పై కూర్చున్న వ్యక్తి యొక్క శిల్పం తమిళనాడులోని పురాతన పంచవర్ణస్వామి ఆలయంలోది కాదు.