గ్రానైట్ కొండ తవ్వకాలలో బయటపడిన అతి పెద్ద వెంకటేశ్వర స్వామి విగ్రహం, అంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: గ్రానైట్ కొండ తవ్వకాలలో బయటపడిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫోటో.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో కనిపిస్తున్న ఈ విగ్రహం గ్రానైట్ తవ్వకాల్లో బయటపడినది కాదు. 300 టన్నులు బరువుండే ఈ మహావిష్ణు విగ్రహన్ని తమిళనాడు తిరువన్నమలై జిల్లా కోరకట్టై గ్రామంలోని కొండ నుండి తయారు చేసారు. ఈ విగ్రహాన్ని బెంగళూరులోని కోదండరామస్వామి గుడిలో ప్రతిష్టించడానికి 2019 మే నెలలో తీసుకువెళ్తున్నప్పుడు ఈ ఫోటో తీసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే విగ్రహం యొక్క ఫోటోని ‘The New Indian Express’ తమ ఆర్టికల్ లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 64 అడుగుల పొడువు కలిగిన ఈ విశ్వరూప మహావిష్ణు విగ్రహాన్ని తమిళనాడు నుండి బెంగళూరుకు తరలిస్తున్నప్పుడు తీసిన ఫోటో అని ఆర్టికల్ లో తెలిపారు. 300 టన్నులు బరువు గల ఈ మహావిష్ణు విగ్రహన్ని తమిళనాడు తిరువన్నమలై జిల్లా కోరకట్టై గ్రామంలోని కొండ నుండి తయారు చేసినట్టు ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఈ విగ్రహాన్ని బెంగళూరులోని కోదండరామస్వామి గుడిలో ప్రతిష్టించడానికి 2019 మే నెలలో తీసుకువెళ్తున్నప్పుడు, ఈ ఫోటో తీసినట్టు తెలిసింది.
ఈ విగ్రహం తమిళనాడు కృష్ణగిరి జిల్లాకు చేరుకున్నప్పుడు తీసిన ఫోటోలని, ఒక జర్నలిస్ట్ 2019లో తన ట్వీట్ లో షేర్ చేసారు. ఈ మహావిష్ణు విగ్రహానికి సంబంధించిన సమాచారాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.
ఈ మహావిష్ణు విగ్రహన్ని ‘ANI’ పబ్లిష్ చేసిన వీడియోలో కూడా మనం చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన మహావిష్ణు విగ్రహం గ్రానైట్ తవ్వకాలలో బయటపడలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, ఫోటోలో కనిపిస్తున్న మహావిష్ణు విగ్రహం గ్రానైట్ తవ్వకాలలో బయటపడినది కాదు.