Fake News, Telugu
 

బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదని బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ పత్రం ఫేక్

0

1925 నుంచి 1947 మధ్య కాలంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదని బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ పేరుతో ఉన్న ఒక పత్రం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A document with a signature  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 1925 నుంచి 1947 మధ్య కాలంలో ఆర్‌ఎస్‌ఎస్‌ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనలేదని బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ పేరుతో ఉన్న పత్రం.

ఫాక్ట్: ఇది ఒక నకిలీ పత్రం. బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ ఇటువంటి పత్రాన్ని విడుదల చేసినట్లు ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడిన క్లెయిమ్ తప్పు.

ముందుగా బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ (లేదా హోం ఆఫీస్) ఈ పత్రాన్ని ప్రచురించినట్లు మాకు ఎటువంటి జాతీయ, అంతర్జాతీయ వార్తా కథనాలు లభించలేదు. బ్రిటిష్ పాలన నాటి డాక్యుమెంట్లు కలిగి ఉండే నేషనల్ ఆర్కైవ్స్ వంటి వెబ్‌సైట్లలో కూడా ఈ పత్రం అందుబాటులో లేదు.

ఇక వైరల్ పత్రాన్ని పరిశీలించగా, ఇందులో ఉన్న చిహ్నం అధికారిక రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్ చిహ్నాలకి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) భిన్నంగా ఉండడం గుర్తించాం. వైరల్ పత్రంలో ఉన్న చిహ్నంలోని అక్షరాలు అధికారిక చిహ్నంలో ఉన్న అక్షరాలతో పోలిస్తే వేరుగా ఉన్నాయి. వైరల్ పత్రంలో ఇవ్వబడిన చిహ్నాలు రెండూ కూడా భిన్నంగా ఉన్నాయి.

A comparison of a logo  AI-generated content may be incorrect.

ఇక, వైరల్ పత్రంలో ఉన్న మౌంట్‌బాటన్ సంతకం కూడా 1978లో తన సహోద్యోగికి రాసిన లేఖ నుంచి తీసుకున్నట్లుగా గుర్తించాం. ఈ లేఖలోని అక్షరాలు వైరల్ పోస్టులో కూడా ఉండడం చూడవచ్చు. దీన్ని బట్టి, ఈ లేఖని మార్ఫ్ చేసి వైరల్ పత్రాన్ని సృష్టించినట్లు తెలుస్తుంది.

A collage of papers with a handwritten letter  AI-generated content may be incorrect.

అలాగే, వైరల్ పత్రాన్ని ముందుగా షేర్ చేసిన ప్రజ్ఞ గుప్తా అనే X (ట్విట్టర్) యూసర్ దీనిపై వివరణ ఇస్తూ, ఇది బ్రిటిష్ పాలన సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించిన కల్పిత పత్రం అని వెల్లడించారు.

చివరిగా, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదని బ్రిటిష్ హోం డిపార్ట్‌మెంట్ పేరుతో ప్రచారంలో ఉన్న ఈ పత్రం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll