27 ఆగస్టు 2025న బిహార్‌లోని దర్భంగాలో జరిగిన ఒక ఓటరు అధికార్ యాత్ర సభ సందర్భంగా, ఒక వ్యక్తి ప్రధానమంత్రి మోదీ, ఆయన దివంగత తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు (ఇక్కడ, ఇక్కడ), రెండు రోజుల తర్వాత అతను అతను అరెస్ట్ అయ్యాడు.
ఈ నేపథ్యంలో, ఆ వ్యక్తి బీజేపీకి చెందిన వాడని చెప్తూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు ఉన్న ఒక కొల్లాజ్ (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. బీహార్‌లో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుర్భాషలాడిన వ్యక్తి ఈ ఫొటోల్లో ఉన్న వ్యక్తి అని, అతను నిజానికి బీజేపీకు చెందిన వ్యక్తి అని క్లెయిమ్ చేస్తూ ఈ ఫోటోలను షేర్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: 27 ఆగస్టు 2025న బీహార్‌లో జరిగిన వోటర్ అధికార్ యాత్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దుర్భాషలాడిన వ్యక్తిని చూపిస్తున్న ఫోటోలు.
ఫ్యాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఫోటోలు మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లోని కోట్మాకు చెందిన బీజేపీ సభ్యుడు నేక్ మొహమ్మద్‌వి, బీహార్‌లో అరెస్ట అయిన నిందితుడు రిజ్వీ అలియాస్ రాజావి కావు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పుదారి పట్టించేలా ఉంది.
వైరల్ అవుతున్న ఫోటోలను గూగుల్ లెన్స్‌లో వెతికితే, బీజేపీ స్కార్ఫ్ ధరించిన వ్యక్తి యొక్క ఫోటో ఉన్న, 18 జూలై 2025 నాటి ఒక ఫేస్‌బుక్ పోస్ట్ మాకు లభించింది. ఈ పోస్ట్‌ను నేక్ మొహమ్మద్ అనే యూజర్ షేర్ చేశారు. తన ఫేస్‌బుక్ అకౌంట్ బయో ప్రకారం, నేక్ మొహమ్మద్ బీజేపీతో సంబంధం కలిగి ఉన్నాడు. అతను మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్‌లోని కోట్మాకు చెందినవాడు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆయన నిలబడి ఉన్న మరొక ఫోటో కూడా తన ఫేస్‌బుక్ అకౌంటులో మాకు లభించింది.

29 ఆగస్టు 2025న అప్‌లోడ్ అతను ఈ వైరల్ క్లెయిమ్ గురించి ఒక పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చాడు అని మేము కనుగొన్నాము. దీనిలో తన ఫోటోను తప్పుగా ఉపయోగించి, తన గురించి పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని చెప్పాడు. ఈ పోస్టులో, తన ఫోటోలను బిహార్‌లోని దర్భంగాలో ప్రధాని మోదీపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి ముడిపెడుతూ షేర్ చేసిన చాలా పోస్టుల స్క్రీన్‌షాట్‌లను పోస్ట్ చేసాడు. అలాగే, కామెంట్స్ విభాగంలో, అతను ఈ విషయంపై కోట్మా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశానని చెప్తున్న వీడియో ఒకటి కూడా షేర్ చేసాడు.

తనకు బీహార్‌తో ఎటువంటి సంబంధం లేదని, అతను ఆ రాష్ట్రాన్ని ఎప్పుడూ సందర్శించలేదని నేక్ మొహమ్మద్ NDTV వారి ఒక షోలో స్పష్టం చేశాడు.
దర్భాంగా పోలీసులు 29 ఆగస్టు 2025న చేసిన ఒక X- పోస్ట్ ప్రకారం, ప్రధానమంత్రి మోదీపై అసభ్యకరమైన భాషను ఉపయోగించిన నిందితుడు రిజ్వి అలియాస్ రాజాని అరెస్టు చేశారు. ఇతను దర్భాంగా జిల్లాలోని సింఘ్వారా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని భాపురా నివాసి, అతని తండ్రి పేరు మొహమ్మద్ అనీస్. వైరల్ కొల్లజ్‌లో ఉన్న మొదటి ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖాన్ని బ్లర్ చేసి, ఫొటోని క్రాప్ చేసి, వీళ్లు తమ ‘X’ పోస్టులో అప్లోడ్ చేశారు.
ఈ విషయం గురించి, దర్భాంగా సదర్‌కు చెందిన SDPO-2 సురేంద్ర కుమార్ సుమన్ ఆజ్ తక్‌తో మాట్లాడుతూ, ఇప్పటివరకు కనుగొన్న విషయాల ఆధారంగా, ఈ కేసులో నిందితుడు రిజ్వి అలియాస్ రాజా, ఇతనికి కాంగ్రెస్‌తో సంబంధం ఉందని చెప్పారు. అయితే, ప్రధానమంత్రి మోదీని దుర్భాషలాడిన వ్యక్తి రాజకీయ అనుబంధాన్ని మేము స్వతంత్రంగా ధృవీకరించలేకపోయాము.
చివరగా, ఈ వైరల్ ఫోటోలలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్‌లోకు చెందిన బీజేపీ సభ్యుడు నేక్ మొహమ్మద్‌ను చూపిస్తున్నాయి, బీహార్‌లో ప్రధాని మోదీని దుర్భాషలాడిన వ్యక్తి రిజ్విగా అలియాస్ రాజాని కాదు.