అజర్‌బైజాన్ ప్రధాన మంత్రి ఒక మహిళను అనుచితంగా తాకిన దృశ్యాలు అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో ఆన్‌లైన్ సమావేశంలో ఒక వయస్సు పైబడిన వ్యక్తి ఒక మహిళను అసభ్యకరంగా తాకడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: అజర్‌బైజాన్ ప్రధాన మంత్రి ఒక మహిళను అనుచితంగా తాకిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఏప్రిల్ 2021 నాటిది. ఈ వీడియోలో మహిళను అనుచితంగా తాకిన వ్యక్తి అజర్‌బైజాన్ ప్రధాని కాదు. అతను అజర్‌బైజాన్ మాజీ ఎంపీ హుసేన్‌బాలా మిరాలమోవ్. వార్తా కథనాల ప్రకారం, హుసేన్‌బాలా మిరాలమోవ్ న్యూ అజర్‌బైజాన్ పార్టీకి (YAP) చెందిన మాజీ ఎంపీ. ఈ సంఘటన తర్వాత అతని న్యూ అజర్‌బైజాన్ పార్టీ (YAP) నుండి బహిష్కరించారు. అలాగే, అజర్‌బైజాన్ స్టేట్ ఆయిల్ అండ్ ఇండస్ట్రీ యూనివర్సిటీలో (ASOIU) ఉపాధ్యాయుడిగా ఉన్న అతన్ని ఉద్యోగం నుండి కూడా తొలగించారు. అలాగే గత లేదా ప్రస్తుత అజర్‌బైజాన్ ప్రధాన మంత్రి ఒక మహిళను ఆన్‌లైన్ సమావేశం జరుగుతుండగా ఇలా అనుచితంగా తాకినట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోను ‘Baku TV’ అనే యూట్యూబ్ ఛానల్ 21 ఏప్రిల్ 2021షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, వీడియోలో ఉన్న వ్యక్తి అజర్‌బైజాన్‌కు చెందిన మాజీ ఎంపీ హుసేన్‌బాలా మిరాలమోవ్.
దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి హుసేన్‌బాలా మిరాలమోవ్, ఆయన న్యూ అజర్‌బైజాన్ పార్టీకి (YAP) చెందిన మాజీ ఎంపీ. ఈ సంఘటన తర్వాత అతని న్యూ అజర్‌బైజాన్ పార్టీ (YAP) నుండి బహిష్కరించారు. అలాగే, అజర్‌బైజాన్ స్టేట్ ఆయిల్ అండ్ ఇండస్ట్రీ యూనివర్సిటీలో (ASOIU) ఉపాధ్యాయుడిగా ఉన్న అతని, ఉద్యోగం నుండి కూడా తొలగించారు. ఓ మీడియా సంస్థతో హుసేన్‌బాలా మిరాలమోవ్ మాట్లాడుతూ వీడియోలో కనిపిస్తున్న మహిళ తన కూతురిలాంటిదని అని పేర్కొన్నారు.

అలాగే గత లేదా ప్రస్తుత అజర్‌బైజాన్ ప్రధాన మంత్రి ఒక మహిళను ఆన్‌లైన్ సమావేశం జరుగుతుండగా ఇలా అనుచితంగా తాకినట్లు కూడా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అజర్‌బైజాన్ ప్రస్తుత ప్రధాన మంత్రి అలీ అసదోవ్. ఆయన అక్టోబర్ 2019 నుండి అజర్‌బైజాన్ ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఈ వైరల్ వీడియోలో చూపిస్తున్న సంఘటన 2021లో చోటుచేసుకుంది. అప్పుడు కూడా అజర్‌బైజాన్ ప్రధానిగా ప్రస్తుత ప్రధాన మంత్రిగా అలీ అసదోవ్ ఉన్నారు. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని, అలీ అసదోవ్‌తో పోలిస్తే చూస్తే వైరల్ వీడియోలో ఉంది అలీ అసదోవ్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, ఈ వైరల్ వీడియోలో మహిళను అనుచితంగా తాకిన వ్యక్తి అజర్‌బైజాన్ ప్రధాని కాదు; అతను అజర్‌బైజాన్ మాజీ ఎంపీ హుసేన్‌బాలా మిరాలమోవ్.