ఒక ఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది పోస్టు చేసి, అందులో ఉన్న అమ్మాయి సిరియా దేశస్థురాలని ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణ ఎంత వరకు నిజమో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: సిరియా అమ్మాయి ఫోటో .
ఫాక్ట్ (నిజం): ఫోటోలోని అమ్మాయి ఇరాక్ దేశస్థురాలు. కావున, పోస్టులోని ఆరోపణ తప్పు.
పోస్టులో ఉన్న ఫోటోని యాండెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అందుకు సంబంధించిన చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఒక సెర్చ్ రెసుల్ట్, ఫోటో లో ఉన్న అమ్మాయి ఇరాక్ దేశానికి చెందింది అని పేర్కొన్నారు. ఆ సెర్చ్ రెసుల్ట్ లో ఉన్న కీవర్డ్స్ తో గూగుల్ లో వెతికినప్పుడు, ‘BBC News’ వారి కథనం లభించింది. ఆ కథనం లో చాలా ఫోటోలు ఉన్నాయి. పోస్టులో ఉన్న ఫోటో కింద ‘బదుష్ సమీపంలో ఇరాక్ దళాలు మరియు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మధ్య జరిగిన యుద్ధం వల్ల ఒక ఇరాకీ అమ్మాయి తన ఇంటి నుండి పారిపోయి వచ్చి ఏడుస్తోంది’ అని రాసి ఉంది. ‘Reuters’ వారు ‘Exodus in Mosul’ అని ప్రచురించిన కథనం లో కూడా ఆ ఫోటోని అదే సమాచారంతో పెట్టినట్టుగా చూడవచ్చు.
చివరగా, ఫోటో లో ఉన్నది సిరియా దేశానికి చెందిన అమ్మాయి కాదు, తను ఇరాక్ దేశస్థురాలు. పోస్ట్ లో చెప్పినట్టు ఆమె ఎంపిక తనకు తెలిసి జరిగిందా లేదా అనే సమాచారం ఎక్కడా దొరకలేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఫోటో లో ఉన్నది సిరియా దేశానికి చెందిన అమ్మాయి కాదు - Fact Checking Tools | Factbase.us