తిరువనంతపురం నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ EK521 విమానం క్రాష్ ల్యాండ్ అవ్వడం వలన మంటలు చెలరేగాయని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 280 మంది సురక్షితంగా బయటపడ్డారని, ఒక ఫైర్ ఫైటర్ చనిపోయారని పోస్టులో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆగష్టు 2025లో దుబాయిలో జరిగిన ఎమిరేట్స్ EK521 విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్: ఈ ఘటన 03 ఆగష్టు 2016లో జరిగింది, ఆగష్టు 2025లో కాదు. లాండింగ్ సమయంలో జరిగిన లోపాల వల్ల ఎమిరేట్స్ EK-521 విమానం క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రమాదంలో 282 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడగా, ఒక అగ్నిమాపక సిబ్బంది చనిపోయారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, ఈ విషయం గురించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ ప్రమాదం 03 ఆగస్టు 2016న దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగినట్లు జరిగినట్లు పలు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి.

ఎమిరేట్స్ విడుదల చేసిన పత్రికా ప్రకటన (ఆర్కైవ్) ప్రకారం, 03 ఆగష్టు 2025న తిరువనంతపురం నుంచి దుబాయ్‌కి వచ్చిన ఎమిరేట్స్ విమానం EK-521 ల్యాండింగ్ సమయంలో జరిగిన లోపాల వల్ల క్రాష్ ల్యాండ్ అయ్యింది. అయితే, ఆ సమయంలో విమానంలో ఉన్న 282 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది కూడా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ప్రమాద సమయంలో చెలరేగిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది ఒకరు చనిపోయినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

పై ఆధారాలను బట్టి, వైరల్ పోస్టులో చెప్పబడిన ఘటన 2016లో జరిగినట్లు నిర్ధారించవచ్చు. చివరిగా, 2016లో దుబాయ్‌లో జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాద ఘటనను 2025లో జరిగినట్లుగా షేర్ చేస్తున్నారు.