భర్త నుంచి విడాకులు తీసుకున్న ఒక బుర్ఖా ధరించిన మహిళ తన ముస్లిం మామగారిని (భర్త తండ్రి) చేసుకుంటానని చెప్తున్నట్లు ఉన్న వీడియో ఒక సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీన్ని ఒక నిజమైన ఘటనగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: తన మాజీ భర్త తండ్రిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్న బుర్ఖా ధరించిన మహిళ యొక్క వీడియో.
ఫాక్ట్: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. నిజమైన సంఘటన కాదు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోని అశ్వని పాండే అనే యూట్యూబ్ ఛానెల్లో 28 ఏప్రిల్ 2025న అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోని కేవలం వినోదం కోసమే చిత్రీకరించినట్లు అందులో పేర్కొన్నారు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియోని అశ్వని పాండే అనే యూట్యూబ్ ఛానెల్లో 28 ఏప్రిల్ 2025న అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. ఈ వీడియో పూర్తిగా వినోదం కోసమే చిత్రీకరించబడిందని 0:05 సెకన్ల వద్ద వివరణలో పేర్కొన్నారు.

తాము ప్రాంక్ వీడియోలు అప్లోడ్ చేస్తామని ఇదే ఛానల్‌కు చెందిన ఫేస్బుక్ పేజిలో పేర్కొన్నారు. వైరల్ వీడియోలో కనిపించిన వ్యక్తి ఈ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఇతర స్క్రిప్టెడ్ వీడియోలలో కూడా ఉండడం చూడవచ్చు. పైగా, గతంలో ఇదే వ్యక్తి నటించిన స్క్రిప్టెడ్ వీడియోలని నిజమైనా ఘటనలుగా షేర్ చేసినప్పుడు అవి తప్పు అని రుజువు చేస్తూ FACTLY రాసిన ఫాక్ట్- చెక్ కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ఒక ముస్లిం మహిళ తన మామగారిని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో నిజమైన ఘటనకు సంబంధించినది కాదు. ఇదొక స్క్రిప్టెడ్ వీడియో.