Fake News, Telugu
 

ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నది లేహ్ లో, గాల్వాన్ వ్యాలీ లో కాదు

0

ఒక ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, అది  గాల్వాన్ వ్యాలీ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నదని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గాల్వాన్ వ్యాలీ లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ): ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నది లేహ్ లో, గాల్వాన్ వ్యాలీ లో కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే ఫోటో ‘Art-Sheep’ అనే  వెబ్సైట్ లో లభించింది. ఆ వెబ్సైట్ లోని కథనం లో ఫోటో గురించి ఈ వివరణ ఉంది -‘One of the rare pictures of former Prime Minister late Indira Gandhi addressing jawans in Leh in 1971‘. (మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ 1971 లో లేహ్‌లో జవాన్లను ఉద్దేశించి ప్రసంగించిన అరుదైన చిత్రాలలో ఒకటి).  

ఇదే వివేరణతో ట్విట్టర్ లో వెతకగా, @i_theindian అనే యూజర్ 2017 లోనే లేహ్ లో తీసినట్టుగా ట్వీట్ చేసాడు. @rachitseth అనే వెరిఫైడ్ ట్విటర్ యూజర్ కూడా, ఇది తాను 2012లోనే పోస్ట్ చేసానని, లఢక్ లోనిది అయ్యి ఉండొచ్చని ట్వీట్ చేసాడు. తరువాత అది లేహ్ లోనే తీసింది అని ‘PTI’ ఫోటో అని మరొక ట్వీట్ చేసాడు.

ఈ సమాచారంతో కీవర్డ్స్ తో ‘PTI News’ వెబ్సైట్ లో ఆర్కైవ్స్ లో వెతికినప్పుడు, ఆ ఫోటో లభించింది. ఆ ఫోటో ని ‘లేహ్‌’ లో తీసినట్లుగా ఉంది మరియు ఫోటో క్రెడిట్స్ ‘DPR Defence’ అని ఉంది. ‘లేహ్‌’ అనేది లడఖ్ యూనియన్ టెర్రిటరీ యొక్క రాజధాని. అది గాల్వాన్ వ్యాలీ ప్రాంతం నుండి చాలా దూరం లో ఉంటుంది. 

చివరగా, ఫోటోలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ సైనికులను ఉద్దేశించి మాట్లాడుతున్నది లేహ్ లో, గాల్వాన్ వ్యాలీ లో కాదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll