Fake News, Telugu
 

ఇద్దరు సోదరీమణులపై వారి కుటుంబ సభ్యులు దాడి చేసిన 2021 నాటి వీడియోని కుల వివక్ష ఆరోపణలతో ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఉత్తర్ ప్రదేశ్ లో దళిత మహిళ చెరువులో స్నానం చేసిందని ఇంత ఘోరమైన …క్రూరమైన శిక్షకు గురి చేశారు. దళిత మహిళ చెరువులో స్నానం చేయకూడదా…అదేమైనా పాపమా” అని చెప్తూ ఒక మహిళను కొందరు వ్యక్తులు కర్రలతో, కాళ్లతో మహా దారుణంగా కొడుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది ఒక కులోన్మాద సంఘటన అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్:ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక చెరువులో స్నానం చేసినందుకు ఒక దళిత మహిళను కొందరు కొట్టిన సంఘటనకి చెందిన వీడియో ఇది.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2021 నాటి ఒక పాత సంఘటనకు సంబంధించినది.  22 జూన్ 2021 నాడు మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోని పిపాల్వా గ్రామంలో గిరిజన సమాజానికి చెందిన ఇద్దరు సోదరీమణులు తమ మామ కొడుకులతో ఫోన్‌లో మాట్లాడినందుకు వారి కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టిన సంఘటనకి చేసందిన వీడియో ఇది. ఈ సంఘటనలో ఎలాంటి కుల వివక్ష కోణం లేదు. కావున, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి కొన్ని కీవర్డ్స్ ఉపయోగించి Googleలో సెర్చ్ చేయగా, వైరల్ విజువల్స్‌ని కలిగి ఉన్న జూలై 2021 నాటి కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి. 

వార్తా కథనాల ప్రకారం ఈ సంఘటన జూన్ 2021లో మధ్య ప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో చోటుచేసుకొంది, పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు ఉత్తర్ ప్రదేశ్‌లో కాదు. వైరల్ పోస్ట్‌లో ఆరోపిస్తున్నట్టుగా ఈ సంఘటనలో ఎలాంటి కుల వివక్ష కోణం లేదు.

ఈ వార్తా కథనాల ప్రకారం, ధార్ జిల్లాలోని పిపాల్వా గ్రామంలోని గిరిజన సమాజానికి చెందిన ఇద్దరు సోదరీమణులను, వారి మామ కొడుకులతో ఫోన్‌లో మాట్లాడినందుకు వారి కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టినప్పుడు చిత్రించిన వీడియో ఇది. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయినప్పుడు పోలీసులు ఆ కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేశారు(ఆర్కైవ్డ్ వెర్షన్)

చివరిగా, ఇద్దరు సోదరీమణులపై కొందరు కుటుంబ సభ్యులు దాడి చేసిన పాత వీడియోని,  ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకొన్న కుల వివక్ష సంఘటనకి చెందిన వీడియో అని ఒక కట్టు కథని షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll