Fake News, Telugu
 

పాత వీడియో పెట్టి, ‘లాక్ డౌన్ సమయంలో బ్లాక్ లో లిక్కర్ బాటిల్స్ అమ్ముతూ దొరికిన తృప్తి దేశాయ్’అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఒక వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి, తృప్తి దేశాయ్ లాక్ డౌన్ సమయం లో బ్లాక్ లో లిక్కర్ బాటిల్స్ అమ్ముతూ దొరకడంతో పోలీసులు అరెస్ట్ చేసారు అంటూషేర్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: తృప్తి దేశాయ్ లాక్ డౌన్ సమయం లో బ్లాక్ లో లిక్కర్ బాటిల్స్ అమ్మడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో సెప్టెంబర్ 2019 లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పూణే నగర పర్యటనకు ముందు నివారణ చర్య లో భాగంగా పోలీసులు ‘తృప్తి దేశాయ్‌’ ను కస్టడీలోకి తీసుకున్నది. కావున, వీడియో పాతది మరియు పోస్టు లో చెప్పింది తప్పు.

వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే వీడియో యొక్క యూట్యూబ్ లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. వీడియో ని యూట్యూబ్ లో సెప్టెంబర్ 2019 లో అప్లోడ్ చేసినట్లుగా ఉంది. ఆ వీడియో కింద ఉన్న వివరణ లో ‘తృప్తీ దేశాయ్ మద్యం సీసాల హారంతో ముఖ్యమంత్రికి దండ వేయడానికి ప్రణాళిక వేశారు. పూణే పోలీసులు ఆమె వద్దనుండి ఆ బాటిల్ల దండను తీసుకుని, ఆమెను సహకర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు’ అని ఉంది.

అదే వీడియో ఇప్పుడు వేరే ఆరోపణతో సోషల్ మీడియా లో వైరల్ అవ్వడంతో 2 ఏప్రిల్ 2020 న అది తప్పని చెబుతూ తృప్తీ దేశాయ్ ఒక ఫేస్బుక్ పోస్టు పెట్టింది. అందులో, తాను మహారాష్ట లో గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్న మద్యం విక్రయాలకు నిరసన తెలపడానికి, ముఖ్యమంత్రి పూణే పర్యటన కి వస్తున్నప్పుడు మద్యం బాటిల్ల దండ తో స్వాగతం చెప్దామని ప్రయత్నించడంతో పోలీసులు అది ముందే తెలుసుకుని తనను అదుపులోకి తీస్కున్నారని తెలిపింది.

చివరగా, పాత వీడియో ని పెట్టి, ‘లాక్ డౌన్ సమయంలో బ్లాక్ లో లిక్కర్ బాటిల్స్ అమ్ముతూ దొరికిన తృప్తి దేశాయ్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll