Coronavirus Telugu, Fake News, Telugu
 

2020లో అనంతపూర్ లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించిన పాత న్యూస్ వీడియోని మళ్ళీ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల మళ్ళీ కరోన కేసులు పెరుగుతుండడంతో వివిధ రాష్ట్రాలు స్కూల్స్ మూసి వేయడం, రాత్రి పూట కర్ఫ్యూ విధించడం వంటి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నారని చెప్తున్న TV9 న్యూస్ వీడియోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ లో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో జూన్ 2020లో అనంతపూర్ లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించింది. ప్రస్తుతానికి అనంతపూర్ లో ఎటువంటి లాక్ డౌన్ విధిస్తున్నట్టు అధికారిక సమాచారం గాని లేక వార్త కథనాలు గాని లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

యూట్యూబ్ లో ‘ananthapur lockdown tv9’ అనే కీవర్డ్ తో వెతకగా TV9 యొక్క అధికారిక ఛానల్ లో ఇదే వార్తని 20 జూన్ 2020 రోజున ప్రచురించిన ఒక న్యూస్ వీడియో మాకు కనిపించింది. పోస్టులోని వీడియో మరియు ఈ వీడియో రెండు ఒక్కటే. దీన్నిబట్టి ఈ వీడియో పాతదని స్పష్టంగా అర్ధమవుతుంది.

పైగా పోస్టులోని TV9 న్యూస్ వీడియోలో ఆ రోజు వరకి అనంతపురంలో 600 కరోన కేసులు నమోదైనట్టు ప్రస్తావించడం గమనించొచ్చు. ఐతే ఆంధ్రప్రదేశ్ లోని కరోన కేసులకి సంబంధించిన అధికారిక సమాచారం ప్రకారం అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకి మొత్తం 68,041 కరోన కేసులు నమోదు కాగా అందులో 67,265 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు, అలాగే మొత్తం 601 మంది చనిపోయారు. ఈ గణాంకాల బట్టి కూడా పోస్టులోని వీడియో పాతదని చెప్పొచ్చు. అలాగే ఇటీవల కాలంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు చెప్పే ఎటువంటి అధికారిక సమాచారం గాని లేక వార్తా కథనాలు గాని మాకు లభించలేదు.

చివరగా, 2020లో అనంతపూర్ లో విధించిన లాక్ డౌన్ కి సంబంధించిన పాత న్యూస్ వీడియోని మళ్ళీ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll