Fake News, Telugu
 

ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన పాత వీడియోని తెలంగాణలోని భైంసా పట్టణంలో అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు

0

తెలంగాణ రాష్ట్రంలోని భైంసా పట్టణంలో పట్టపగలు ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తెలంగాణ రాష్ట్రంలోని భైంసా పట్టణంలో పట్టపగలు ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని ఘటన 2017లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో జరిగింది. రాంపూర్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధి లోని ఒక గ్రామంలో 14 మంది యువకులు  ఇద్దరు అమ్మాయిలని వేధిస్తూ ఈ వీడియో తీసినట్టు తెలిసింది. ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలోని భైంసా పట్టణానికి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని షేర్ చేస్తూ ‘The Times of India’ న్యూస్ వెబ్సైటు 29 మే 2017 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలోని ఘటన  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ జిల్లాలో జరిగినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు. ఈ వీడియోని ‘The Times of India’ న్యూస్ సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో కూడా పబ్లిష్ చేసింది.

ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. రాంపూర్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధి లోని ఒక గ్రామంలో, 14 మంది యువకులు  ఇద్దరు అమ్మాయిలని వేధిస్తూ ఈ వీడియో తీసినట్టు తెలిసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రాంపూర్ జిల్లా పోలీసులు ఈ వేధింపు ఘటనకి సంబంధించిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో తెలంగాణ లోని భైంసా పట్టణానికి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇదివరకు, ఈ వీడియోని ఇదే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన పాత వీడియోని తెలంగాణ భైంసా పట్టణంలో పట్టపగలు ఇద్దరు అమ్మాయిలని వేధిస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll