Fake News, Telugu
 

పాత, సంబంధంలేని వీడియోలను జూలై 2025 రష్యా భూకంపానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

30 జూలై 2025న రష్యాలోని తూర్పు కమ్చట్కా ద్వీపకల్పంలో సుమారు 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. కమ్చట్కా ద్వీపకల్పంలో 3-5 మీటర్ల సునామీ నమోదైందని రాయిటర్స్ పేర్కొంది. దీనితో జపాన్, అమెరికా సహా వివిధ దేశాలలో సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. జపాన్, హవాయి, అమెరికా పశ్చిమ తీరప్రాంతంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా, జపాన్ దేశాలలో ఈ భూకంపం, సునామీ సృష్టించిన విధ్వంసాన్ని చూపుతుందని చెప్తూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: 30 జూలై 2025 రష్యా భూకంపం కారణంగా రష్యా, జపాన్ దేశాలలో జరిగిన విధ్వంసాన్ని చూపుతున్న వీడియోలు.  

ఫాక్ట్: ఈ వీడియోలలో ఎక్కువ భాగం 30 జూలై 2025లో రష్యాలో వచ్చిన భూకంపానికి సంబంధించినవి కావు. కావున పోస్టులలో చేయబడ్డ క్లెయిమ్స్ తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.

Update (31 July 2025):

వీడియో 5:

రష్యా తీర ప్రాంతాన్ని సునామీ అతలాకుతలం చేస్తుందని కొన్ని వీడియో క్లిప్పులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ప్రచారంలో ఉన్నాయి.

సముద్రంలో అలలు ఎత్తుగా ఎగసిపడుతున్నట్లు చూపుతున్న మొదటి రెండు క్లిప్పులు  కనీసం 2023 నుంచి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. నవంబర్ 2023లో జార్జియా ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లుగా స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించి మేము ఇదివరకే రాసిన ఫాక్ట్-చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.

A screenshot of a video  AI-generated content may be incorrect.

అలాగే, భూకంపం తీవ్రతకు ఇంట్లోని సామన్లను కంపించడాన్ని చూపుతున్న మరో  వీడియో క్లిప్పు ఏప్రిల్ 2024లో చైనాలో భూంకంపం వచ్చినప్పటి దృశ్యాలను (ఇక్కడ & ఇక్కడ) చూపుతుంది.

A screenshot of a video  AI-generated content may be incorrect.

Published (30 July 2025):

వీడియో 1:

రష్యాలో భూకంపం కారణంగా ఒక షాపులో పని చేస్తున్న మహిళపై పడినట్లుగా ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి ప్రచారంలో ఉంది.

A person working at a desk  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

వైరల్ వీడియోలోని దృశ్యాలు రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని మార్చి 2025లో పలు మీడియా సంస్థలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) రిపోర్ట్ చేశాయి. 28 మార్చి 2025లో మయన్మార్ దేశంలోని మాండలే నగరంలో భూకంపం వచ్చిన సమయంలో ఒక షాపులో రికార్డు ఈ వీడియో రికార్డు చేయబడిందని ఈ  మీడియా కథనాలు పేర్కొన్నాయి.

వీడియో 2:

రష్యాలో సునామీ దాటికి సముద్రపు ఒడ్డున ఉన్న పడవలు కొట్టుకుపోతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి ప్రచారంలో ఉంది.

A screenshot of a video  AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

ఈ వీడియో 2017లో గ్రీన్‌ల్యాండ్ ప్రాంతంలో వచ్చిన సునామీని చూపుతుంది. దీనికి సంబంధించిన మీడియా కథనాలను ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

A screenshot of a video  AI-generated content may be incorrect.

వీడియో 3:

రష్యాలో సునామీ దృశ్యాలంటూ ఒక వీడియా (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

ఈ వీడియో 2017లో దక్షిణ ఆఫ్రికాలోని డర్బన్ బీచ్ దగ్గర రికార్డ్ చేయబడింది. మార్చి 2017లో డర్బన్ బీచ్‌లో ఒకేసారి పెద్ద అలలు రావడంతో పర్యాటకులు పారిపోవడాన్ని ఈ వీడియో చూపుతుంది. ఈ వీడియోకి సంబంధించి మేము ఇదివరకే రాసిన ఫాక్ట్- చెక్ ఆర్థికల్‌ని ఇక్కడ చూడవచ్చు.

వీడియో 4:

రష్యాలో సునామీ ధాటికి తెల్ల(బెలూగా) తిమింగలాలు ఒడ్డుకి కొట్టుకొచ్చాయని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) వైరల్ అవుతోంది.

A screenshot of a video  AI-generated content may be incorrect.

ఈ వీడియో ఆగస్ట్ 2023లో రష్యాలోని కమ్చట్కా ప్రాంతంలో జరిగినట్లు వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) లభించాయి. సముద్రపు ఒడ్డుకి కొట్టుకు వచ్చిన ఐదు తెల్ల(బెలూగా) తిమింగలాలను స్థానికులు రక్షించి తిరిగి సముద్రంలోకి వదిలారని అందులో పేర్కొన్నారు.

చివరిగా, పాత, సంబంధంలేని వీడియోలను జూలై 2025 రష్యా భూకంపానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll