Fake News, Telugu
 

ఉదయపూర్ హత్య గురించి చిన్న వార్త కూడా రాయని ‘న్యూ యార్క్ టైమ్స్’ & ‘బీబీసీ’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

ఉదయపూర్ లో ఈ ఏడాది జూన్ 29వ తారీఖున జరిగిన కన్నయ్య లాల్ అనే హిందూ టైలర్ హత్య గురించి న్యూ యార్క్ టైమ్స్ మరియు బీబీసీ ఒక్క వార్త కూడా రాయలేదు అంటూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో చూద్దాం.

క్లెయిమ్: ‘ఉదయపూర్ హత్య గురించి చిన్న వార్త కూడా రాయని  న్యూ యార్క్  టైమ్స్  & బీబీసీ’.

ఫాక్ట్ (నిజం): ‘న్యూ యార్క్  టైమ్స్’ మరియు ‘బీబీసీ’ తమ తమ వెబ్‌సైటులో ఉదయ్‌పూర్‌ హత్య గురించి వార్త కథనాలు ప్రచురించారు. బీబీసీ యూట్యూబ్ ఛానల్ లో వీడియో కథనాలు కూడా అప్లోడ్ చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

సరైన కీ వర్డ్స్ తో ఇంటర్నెట్ లో సెర్చ్ చెయ్యగా ‘బీబీసీ’ మరియు ‘న్యూ యార్క్ టైమ్స్’ తమ తమ వెబ్సైట్లలో ఉదయ్‌పూర్‌ హత్య గురించి ప్రచురించిన వార్తా కథనాల లింకులు లభించాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

‘బీబీసీ’ మరియు ‘న్యూ యార్క్ టైమ్స్’ ట్విట్టర్ అకౌంట్లలో కూడా ఉదయ్‌పూర్‌ హత్య సంబందించిన ట్వీట్స్ కూడా చేసారు. వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ‘న్యూ యార్క్ టైమ్స్’ మరియు ‘బీబీసీ’ ఉదయపూర్ హత్య గురించి ఒక్క వార్త కూడా రాయలేదు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll