Fake News, Telugu
 

కేరళ లోని ఓ చర్చి నుంచి ED 7 వేల కోట్ల నల్ల ధనాన్ని జప్తు చేయలేదు

0

కేరళ లోని బెలోరియన్ అనే చర్చి నుంచి ED 7 వేల కోట్ల రూపాయల నల్ల ధనాన్ని జప్తు చేసిందని, యోహానన్ అనే బిషప్ దీన్ని నడుపుతున్నాడని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూదాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: కేరళ లోని ఒక చర్చి నుంచి ED 7 వేల కోట్లు నల్ల ధనాన్ని జప్తు చేసింది.

ఫాక్ట్: బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి పై దాడులు చేసి 7 వేల కోట్లు నల్ల ధనాన్ని ED జప్తు చేయలేదు, నవంబర్ 2020 లో ఈ చర్చి పై IT దాడులు జరిగిన నేపథ్యంలో ED వారు కూడా పూర్తి దర్యాప్తు చేస్తారు అని న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది. IT దాడులు చేసాక, తమ ప్రెస్ రిలీజ్ లో ‘ఢిల్లీలో ప్రార్థనా స్థలంలో రూ.3.85 కోట్లతో సహా సుమారు రూ. 6 కోట్ల నగదు కూడా దాడుల సమయంలో దొరికాయి‘ అని వివరించారు. అదే ప్రెస్ రిలీజ్ లో, ‘ఉన్న సాక్షాలని బట్టి నగదు రూపంలో పక్క దారి పట్టించిన నిధుల విలువ వందల కోట్ల రూపాయలు ఉండొచ్చు’ అని IT శాఖ పేర్కొంది. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

కేరళ లో బెలోరియన్ అనే పేరుతో ఏ చర్చి లేదు, ఆ చర్చి పేరు బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి. ఈ పోస్ట్ లోని ED దాడికి సంబంధించి ఇంటర్నెట్ లో వెతకగా మాకు కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లభించాయి. ED చర్చి యొక్క కార్యకలాపాల మీద పూర్తి దర్యాప్తు చేయనుంది అని ఈ ఆర్టికల్ లో వివరించారు. అయితే ఇంతకముందు జరిగిన IT దాడుల ఆదారంగా ఈ యొక్క దర్యాప్తు ఉండబోతుంది అని చెప్పారు. దీనికి సంబంధించి ఇంకో న్యూస్ ఆర్టికల్ ఇక్కడ చూడొచ్చు.

2020 సంవత్సరం నవంబర్ నెలలోనే బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి మీద IT డిపార్టుమెంటు వారు దాడి చేసారు. ఈ దాడుల విషయాన్ని గురించి IT డిపార్టుమెంటు వారు తమ ప్రెస్ రిలీజ్ లో వివరించటం జరిగింది. ‘ఢిల్లీలో ప్రార్థనా స్థలంలో రూ.3.85 కోట్లతో సహా సుమారు రూ.6 కోట్ల నగదు కూడా దాడుల సమయంలో దొరికాయి‘ అని వివరించారు. అదే ప్రెస్ రిలీజ్ లో, ‘ఉన్న సాక్షాలని బట్టి నగదు రూపంలో పక్క దారి పట్టించిన నిధుల విలువ వందల కోట్ల రూపాయలు ఉండొచ్చు’ అని IT శాఖ పేర్కొంది. కొన్ని మీడియా సంస్థలు ఆ దాడిలో 14 కోట్లు జప్తు చేసినట్టు ప్రచురించాయి. వాటికి సంబంధించి ఆర్టికల్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ ఘటన గురించి ఇంకొంత సమాచారం వెతకగా, ‘మాతృభూమి‘ వారి ఆర్టికల్ లభించింది. 5 ఏళ్లలో చర్చికి విదేశీ సహాయంగా రూ.6000 కోట్లు లభించినట్లు డిపార్ట్ మెంట్ గుర్తించింది’ అని ‘మాతృభూమి’ ఆర్టికల్ తెలిపింది.  కానీ ఇతర వార్తా సంస్థలు ’18 సంవత్సరాల కాలంలో చర్చికి రూ.1,000 కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయని ఆరోపించాయి’ అని తెలపడంతో ఈ సంఖ్య ఎంత అన్నది ఇంకా ధృవీకరించబడలేదు. కాబట్టి, ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నది రూ.7000 కోట్ల నగదు కాదు. బిలీవర్స్ ఈస్టర్న్ చర్చి చేసిన ప్రకటనను ‘ది హిందూ’ వ్యాసంలో చదవవచ్చు.

చివరగా, కేరళ లోని ఓ చర్చి నుంచి ED 7 వేల కోట్ల నల్ల ధనాన్ని జప్తు చేయలేదు. IT దాడులు చేసాక, తమ ప్రెస్ రిలీజ్ లో ‘ఢిల్లీలో ప్రార్థనా స్థలంలో రూ.3.85 కోట్లతో సహా సుమారు రూ.6 కోట్ల నగదు కూడా దాడుల సమయంలో దొరికాయి‘ అని వివరించారు.

Share.

About Author

Comments are closed.

scroll