Fake News, Telugu
 

ప్రపంచంలో అత్యధికముగా చదువుకున్న నాయకులలో రాహుల్ గాంధీ 7వ స్థానంలో నిలిచారని ఫోర్బ్స్ సంస్థ తెలుపలేదు

0

ఫోర్బ్స్ నిర్వహించిన సర్వేలో, ప్రపంచంలో అత్యధికముగా చదువుకున్న నాయకులలో రాహుల్ గాంధీ 7 వ స్థానంలో నిలిచారు, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంత వరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోర్బ్స్ నిర్వహించిన ప్రపంచంలో అత్యధికముగా చదువుకున్న నాయకుల సర్వేలో రాహుల్ గాంధీ 7 వ స్థానంలో నిలిచారు.

ఫాక్ట్ (నిజం): నాయకుల చదువులకి సంబంధించి ఫోర్బ్స్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదు. రాహుల్ గాంధీ ప్రపంచంలో అత్యధిక చదువుకున్న నాయకులలో 7వ స్థానంలో నిలిచారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ కి సంబంధించిన వివరాల కోసం ఫోర్బ్స్ వెబ్సైటులో వెతకగా, నాయకుల చదువులకి సంబంధించి ఫోర్బ్స్ సంస్థ ఇప్పటివరకు ఎలాంటి సర్వే నిర్వహించలేదు అని తెలిసింది.

రాహుల్ గాంధీ అమేథి నియోజకవర్గం ఎంపి స్థానం కోసం ఫైల్ చేసిన అఫిడవిట్లో ఆయన చదువుకి సంబంధించిన వివరాలు దొరికాయి. ఫ్లోరిడా లోని రోల్లిన్స్ కాలేజీ నుంచి ‘బ్యాచిలర్ అఫ్ ఆర్ట్స్’ పూర్తి చేసిన రాహుల్ గాంధీ, ఆ తరువాత ట్రినిటీ కాలేజీలో ‘మాస్టర్స్ అఫ్ ఫిలోసఫి’ పూర్తి చేసినట్టు దాంట్లో రాహుల్ గాంధీ తెలిపారు. రాహుల్ గాంధీ ప్రపంచ అత్యధిక చదువుకున్న నాయకులలో 7 వ స్థానంలో ఉన్నారనటానికి ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, ఫోర్బ్స్ సర్వే లో రాహుల్ గాంధీ ప్రపంచంలో అత్యధికముగా చదువుకున్న నాయకులలో 7వ స్థానంలో నిలిచారంటు చేస్తున్న క్లెయిమ్ తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll