కొన్ని ఫోటోలను ఫేస్బుక్ లో పోస్టు చేసి, అవి ఇటలీ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులవని వాటి గురించి చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటలీ లో రోడ్డు మీద చికిత్స పొందుతున్న కొరోనా పేషెంట్ల ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఫోటోలు క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించినవి. భూకంపం వచ్చినందు వల్ల హాస్పిటల్ లోని పేషెంట్లని బయటికి తీసుకొని వచ్చారు. కావున పోస్ట్ లో చెప్పిందితప్పు.
ఫోటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అవి క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించినవని తెలుస్తుంది. క్రోయేషియా రాజధాని ‘జగ్ రెబ్’ లో 22 మార్చి న రిక్టార్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
ఫోటో ని ‘Total Croatia News’ అనే వెబ్సైటు క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించి రాసిన కథనం లో చూడవచ్చు.
ఫోటోని ‘Nadorcity’ అనే న్యూస్ వెబ్సైటులో క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించి రాసిన కథనం లో చూడవచ్చు. అదే ఫోటో ని ఒక జర్నలిస్ట్ పెట్టిన ట్వీట్ లో కూడా చూడవచ్చు.
క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించి ‘Aljarida’ అనే న్యూస్ వెబ్సైటు రాసిన కథనం లో ఫోటోని చూడవచ్చు. ‘AP’ ఇమేజెస్ లో అలాంటి పరిసరాలతోనే ఉన్న ఫోటో ని చూడవచ్చు.
ఫోటోని ‘Nadorcity’ అనే న్యూస్ వెబ్సైటులో క్రోయేషియా దేశం లో 22 మార్చి న సంభవించిన భూకంపానికి సంబంధించి రాసిన కథనం లో చూడవచ్చు. అదే సమాచారాన్ని మరొక వెబ్సైటు ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
క్రోయేషియా లో కరోనావైరస్ తీవ్రత వల్ల ప్రస్తుతం ‘లాక్ డౌన్’ అమలు లో ఉంది. దాని వల్ల ఫోటోల్లో కనిపించే వారు ఫేస్ మాస్క్ ధరించి ఉన్నారు. క్రోయేషియా లో ఇప్పటివరకు 380 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి మరియు ఒకరు చనిపోయారు.
చివరిగా, క్రోయేషియా దేశం లో ఇటివల సంభవించిన భూకంపానికి సంబంధించిన ఫోటోలను పెట్టి, ‘ఇటలీ లో ప్రస్తుత పరిస్థితి’ అని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?