వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం లభించన తర్వాత (ఇక్కడ, ఇక్కడ), రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన అనంతరం అది చట్టంగా మారింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలో, ఆ బిల్లుకు మద్దతు తెలిపినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను ఒక వ్యక్తి చెంపపై కొట్టాడన్న క్లెయిమ్‌తో కూడిన వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు తను మద్దుతు ఇచ్చారు అన్న కారణంగా, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని ఒక వ్యక్తి చెంపపై కొడుతున్న వీడియో.
ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో 2022 నాటిది. మార్చ్ 2022లో బీహర్‌లోని భక్తియార్‌పుర్‌లో ఒక వేడుకకు వెళ్లినప్పుడు ఒక వ్యక్తి నితీష్ కుమార్‌ని కొట్టాడు. ఈ వీడియోకి వక్ఫ్ (సవరణ) బిల్లు–2025కు ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోని వెరిఫై చేస్తున్న సమయంలో, MOJO అనే ఒక లోగో మాకు కనిపించింది. దీన్ని క్లూగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో యొక్క అసలు వెర్షన్ మాకు ‘Mojo Story’ యూట్యూబ్ ఛానల్‌లో లభించింది.
ఈ వీడియోను వారు 27 మార్చి 2022లో అప్లోడ్ చేశారు. దీని టైటిల్, వివరణ ప్రకారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మార్చి 2022లో భక్తియార్‌పుర్, బీహర్‌లోని ఒక వేడుకకి వెళ్లినప్పుడు ఒక వ్యక్తి కొట్టాడు.

ఇదే సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలని మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ కథనాల ప్రకారం, 27 మార్చి 2022న నితీష్ కుమార్ తన సొంత ఊరు అయిన భక్తియార్‌పుర్‌లో షీల్‌భద్ర యాజీ అనే స్వాతంత్ర్య సమర యోధుడికి నివాళులు అర్పిస్తుండగా శంకర్ కుమార్ వర్మ అనే ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి తనను కొట్టాడు.

ఈ వీడియోను వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 తర్వాత జరిగిన సంఘటనగా తప్పుగా షేర్ చేస్తున్నారు. అసలు నితీష్ కుమార్‌పై ఇటీవల ఈ కారణంగా ఏదైనా దాడి జరిగిందా అని తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా మాకు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు ఏవీ లభించలేదు.
చివరగా, వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని ఒక వ్యక్తి ఇటీవల కొట్టాడు అని 2022 నాటి పాత వీడియోని షేర్ చేస్తున్నారు.