టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది . ఇందులో ఒక వ్యక్తి రెండు గోడల మధ్య దూకుతూ, చేతుల సాయం లేకుండా కేవలం కాళ్లతో పైకి వెళ్లడం మనం చూడవచ్చు. విజయ్ దేవరకొండ స్టంట్స్ చేస్తున్న వీడియో అంటూ, దీని గురించి ప్రముఖ వార్తా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ). అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: నటుడు విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘కింగ్‌డమ్’ కోసం స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో.
ఫ్యాక్ట్ (నిజం): ఈ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ కాదు, ఇరాన్ దేశానికి చెందిన మోస్థాఫా హోర్మతి అనే పార్కోర్ అథ్లెట్. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
ఈ వీడియో వెనుక ఉన్న నిజానిజాలను తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో (ఇక్కడ, ఇక్కడ) కానీ, ‘కింగ్‌డమ్’ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రొఫైల్స్‌లో కానీ ఎక్కడ మాకు ఈ వీడియో, విజయ్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసింది, అని చెప్తూ పోస్ట్ చేసినట్లు సమాచారం లేదు.
తర్వాత, వీడియో గురించి మరిన్ని వివరాల కోసం, అందులోని కొన్ని కీఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూసాము. ఈ సెర్చ్ ద్వారా ఈ వీడియో మాకు mostafa_hormati (మోస్థాఫా హోర్మతి) అనే పార్కోర్ అథ్లెట్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పేజీలో లభించింది.

ఈ వీడియోని తను 14 జూన్ 2025న అప్లోడ్ చేశాడు. మోస్థాఫా ఇన్‌స్టాగ్రామ్ పేజీలో, తను ఇటువంటి పార్కోర్ స్టంట్స్ చేస్తున్న అనేక వీడియోలు ఉన్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఇతను ఇరాన్ దేశస్థుడు అని తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంది.
చివరగా, వైరల్ వీడియోలో స్టంట్స్ చేస్తున్న వ్యక్తి విజయ్ దేవరకొండ కాదు, ఇరాన్ దేశానికి చెందిన పార్కోర్ అథ్లెట్ మోస్థాఫా హోర్మతి